హైదరాబాద్:డ్యాన్స్ స్కూల్ పేరిట యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నిందితుడిని హైద్రాబాద్ గచ్చిభౌలి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 

గచ్చిభౌలి టీఎన్‌జీవో  కాలనీలో నివాసం ఉండే విజయవాడకు చెందిన చిరంజీవి జుంబా డ్యాన్స్ స్కూల్ నిర్వహిస్తున్నాడు. గచ్చిభౌలితో పాటు హైద్రాబాద్ లో మరో రెండు చోట్ల కూడ స్కూల్స్ ను ఏర్పాటు చేశారు.  డ్యాన్స్ నేర్చుకొనేందుకు వచ్చిన యువతులను చిరంజీవి మభ్యపెట్టేవాడు. డ్యాన్స్ స్కూల్ పెడితే బాగా లాభాలను ఆర్జించే అవకాశం ఉందని కూడ నమ్మించేవాడు.

ఈ మాటలను నమ్మిన ఇద్దరు యువతులు చిరంజీవికి డబ్బులు ఇచ్చారు. టీఎన్‌జీఓఎస్ కాలనీకి చెందిన యువతి రూ. 9 లక్షలు, హైదర్షాకోట్‌కు చెందిన యువతి రూ. 6 లక్షలను ఇచ్చింది. అయితే డ్యాన్స్ స్కూల్స్ ఏర్పాటు చేయలేదు.

 ఈ డబ్బులు అడిగిన యువతులను నిందితుడు లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. మోసపోయినట్టుగా యువతులు గుర్తించి ఈ నెల 4వ తేదీన గచ్చిభౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా విచారించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.