Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ అంబేద్కర్ వారసుడు... ప్రతిపక్ష నాయకులూ జేజేలు కొట్టండి: మోత్కుపల్లి

తెెలంగాణ సీఎం కేసీఆర్ ను మరోసారి అంబేద్కర్ వారసుడంటూ కొనియాడారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. తన దళిత సమాజం కోసం తీసుకువచ్చిన దళిత బంధు అద్భుతమని మోత్కుపల్లి అన్నారు. 

Dalit Bandhu Scheme...  Ex Minister Motkupalli Narasimhulu Praises CM KCR akp
Author
Aleru, First Published Aug 6, 2021, 1:25 PM IST

భువనగిరి: తన ఆలేరు నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించడం సంతోషదాయకమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. వాసాలమర్రి గ్రామ దళితుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ పథకాన్ని అమలుచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. భారతదేశంలో అతి పెద్ద నిర్ణయం తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మోత్కుపల్లి కొనియాడారు. 

''ఇంతకాలం అన్ని పార్టీలు దళితులను దళితులుగానే చూశారు. కానీ నేరుగా దళితుల ఖాతాల్లో పది లక్షల రూపాయలు వేయడం ఎక్కడా చూడలేదు. రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికి దళిత బంధు ఇస్తారనడానికి వాసాలమర్రె నిదర్శనం'' అన్నారు. 

''తెలంగాణలో ప్రతిపక్షంలో వున్న పార్టీలవారు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దళిత బంధు అమలు చేసే ధైర్యం ఉందా? దళిత బంధు దేశం మొత్తం అమలు చేసే విధంగా జాతీయ పార్టీలు తమ అధిష్ఠానాలను ఒప్పించాలి'' అని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. 

read more  వాసాలమర్రి వాసులకు గుడ్‌న్యూస్: తెలంగాణ దళితబంధు కింద నిధులు మంజూరు

''హుజురాబాద్ నియోజకవర్గానికే పరిమితం అని దళిత బంధుపై అవాకులు చెవాకులు మాట్లాడిన వారు ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాలి. దళితులను బాగు చేయాలనే ఉద్దేశ్యమే తప్ప కేసీఆర్ నిర్ణయంలో రాజకీయాలేమీ లేవు. దళితులకు 

''రాబోయే కాలంలో అంబెడ్కర్ వారసుడు గా సీఎం కేసీఆర్ నిలుస్తాడు. అన్ని పార్టీల నాయకులు కేసీఆర్ కు జేజేలు పలుకాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ లేకపోతే మేము మంత్రులం ,ఎమ్మెల్యేలం కాకపోయేవారిమి. అలాగే దళిత బిడ్డల ఆర్థిక పరిపుష్టి కల్పిస్తే రాబోయే రోజుల్లో అంబేద్కర్ వారసుడిగా కేసీఆర్ మిగిలిపోతారు'' అని కొనియాడారు. 

''బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దమ్ము, దైర్యం ఉంటే దేశం మొత్తం దళిత బంధు పథకం అమలు చేయించాలి. దమ్ము దైర్యం ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. దళిత బంధు పథకం అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు మనం మద్దతు ఉండాలి. అన్ని రాజకీయ పార్టీల లో ఉండే దళిత నాయకులు ఆయా పార్టీల మీద ఒత్తిడి తేవాలి... రాష్ట్రం మొత్తం అమలు అయ్యేలా చూడాలి'' అని సూచించారు. 

''మానవత్వం కలిగిన వ్యక్తి సీఎం కేసీఆర్. మరియమ్మ విషయంలో పోలీస్ అధికారులను శాశ్వతంగా సర్వీస్ నుండి తొలగించారు... అంతేకాదు నిన్న వరంగల్ లో ఒక ఎస్సైపై మహిళా ట్రైనీ ఎస్సై చేసిన ఆరోపణల విషయంలో కూడా వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు'' అని పేర్కొన్నారు. 

''ఇక దళితులు ఎవ్వరు కుడా  ఈటల రాజేందర్ కు ఓటు వేయరు. మా దళితుల భూములు ఆక్రమించుకున్న ఆయనకు ఓటమి తప్పదు. రాబోయే రోజుల్లో ఈటల రాజేందర్ తగిన గుణపాఠం చెపుతారు మా దళితులు. ఆలయ భూములు ఆక్రమించిన ఆయనకు ఓటు ఎలా వేస్తారు?'' అని మోత్కుపల్లి అన్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios