Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో జ‌ప‌నీస్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ సంస్థ‌ రూ. 450 కోట్ల పెట్టుబడి.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్

జ‌ప‌నీస్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ సంస్థ‌ DAIFUKU తెలంగాణ‌లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందకు వచ్చింది. ఆటోమేటెడ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ టెక్నాలజీ, సొల్యూషన్స్ అందించే DAIFUKU సంస్థ హైద‌రాబాద్‌లోని చంద‌న‌వెల్లిలో రూ. 450 కోట్లతో ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.

DAIFUKU to invest Rs 450 crore in Telangana
Author
First Published Dec 13, 2022, 3:18 PM IST

జ‌ప‌నీస్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ సంస్థ‌ DAIFUKU తెలంగాణ‌లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందకు వచ్చింది. ఆటోమేటెడ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ టెక్నాలజీ, సొల్యూషన్స్ అందించే DAIFUKU సంస్థ హైద‌రాబాద్‌లోని చంద‌న‌వెల్లిలో రూ. 450 కోట్లతో ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. దాదాపు 800 మందికి పైగా ప్ర‌త్య‌క్షంగా ఉపాధి క‌ల్పించ‌నుంది.  ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. డైఫుకు పెట్టుబడులను స్వాతగించిన కేటీఆర్..  రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు పెద్దగా ఆలోచించి ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తయారు చేయాలని కోరారు.

ఈ కంపెనీ ఆటోమేటెడ్ స్టోరేజ్ సిస్టమ్స్, కన్వేయర్లు, ఆటోమేటిక్ స్టార్టర్స్ వంటి పరికరాలను తయారు చేస్తుంది. 2 లక్షల చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో అత్యాధునిక పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. మొదటి దశ విస్తరణ కోసం రూ. 200 కోట్లు ఖర్చు చేయనుండగా.. రాబోయే 18 నెలల్లో కొత్త పరిశ్రమను ప్రారంభించే యోచనలో ఉంది. 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కరోనా తర్వాత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో అనేక మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. జపాన్ అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ముందుకు సాగుతున్నదని అన్నారు. దండు మైలారంలో అతిపెద్ద పారిశ్రామిక పార్కును తీసుకొచ్చామని కేటీఆర్ అన్నారు. దండుమల్కాపూర్‌లోని ఇండస్ట్రియల్‌ పార్కును ఉదహరిస్తూ.. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు తమ కార్యకలాపాలను పెంచుకోవడంలో పోటీ పడాలని, రాష్ట్రంలో పెద్ద పార్కులను ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. తయారీ రంగంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. 

ఇండియాలో త‌మ ఉత్ప‌త్తుల త‌యారు వేగ‌వంతం చేస్తామ‌ని సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ గ‌రిమెళ్ల స్ప‌ష్టం చేశారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మరింత సామర్థ్యంతో ఉత్పత్తులను తయారు చేస్తామని ఆయన ప్రకటించారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా కేటీఆర్‌ వ్యవహరిస్తున్నారని ప్రశంసించిన ఆయన చందనవెల్లిలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios