హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులకు తీపి కబురు అందించింది తెలంగాణ సర్కార్. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంచుతూ జీవో విడుదల చేసింది. 

కరవు భత్యం పెంపు ఉత్తర్వులను జారీ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ పెంచడంతో తెలంగాణ ఉద్యోగుల మూల వేతనం  30.392 శాతానికి చేరింది. పెరిగిన డీఏను జూలై 2018 నుంచి మే 2018 వరకు జీపీఎఫ్ ఖాతాలో కలుపుతారని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. 

డీఏ కోసం తెలంగాణ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పెన్షనర్లకు సంబంధించి డీఏను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.