Asianet News TeluguAsianet News Telugu

Big Breaking: మాజీ మంత్రి డి.శ్రీనివాస్‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు 

D Srinivas: మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్‌ ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన ఇవాళ హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆయన గత కొన్ని రోజులు కిడ్నీ సమస్య, పక్షవాతంతో బాధపడుతున్నారు. 

D Srinivas Hospitalized In Hyderabad KRJ
Author
First Published Sep 11, 2023, 10:29 PM IST | Last Updated Sep 11, 2023, 10:29 PM IST

D Srinivas: మాజీ ఎంపీ, సీనియ‌ర్ నాయ‌కులు డి. శ్రీనివాస్(DS) సోమ‌వారం  తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి కుటుంబ స‌భ్యులు త‌ర‌లించారు. డీఎస్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గ‌త కొంత‌కాలంగా ఆయన కిడ్నీ సమస్య, పక్షవాతంతో బాధపడుతున్నారు.తన తండ్రి(డీఎస్) అస్వస్థతకు గురైనట్టు ఎంపీ అర్వింద్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ప్రత్యేక వైద్య బృందం ఆయనకు  చికిత్స అందిస్తోంది.

అనారోగ్యం కారణంగా డి.శ్రీనివాస్‌ కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన చిన్న కుమారుడు అర్వింద్‌ నిజామాబాద్‌ బీజేపీ ఎంపీగా ఉన్నారు. అటు పెద్ద కుమారుడు సంజయ్‌ కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్‌ పిలుపుతో ధర్మపురి శ్రీనివాస్‌ బీఆర్‌ఎస్‌లో చేరారు. రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు . 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios