Asianet News TeluguAsianet News Telugu

సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతా : సైబరాబాద్ కొత్త సీపీ స్టీఫెన్ రవీంద్ర

సైబరాబాద్ పోలీస్ కమీషనర్‌గా సీనియర్ ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సీపీగా విధులు నిర్వర్తించిన వీసీ సజ్జనార్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీగా నియమించింది. 

cyberabad police commissioner stephen ravindra thanks to cm kcr
Author
Hyderabad, First Published Aug 25, 2021, 7:29 PM IST

తనపై నమ్మకం వుంచి సీపీ బాధ్యతలు అప్పగించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు సైబరాబాద్ నూతన పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తానని రవీంద్ర చెప్పారు. సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. 

అంతకుముందు సైబరాబాద్ పోలీస్ కమీషనర్‌గా సీనియర్ ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సీపీగా విధులు నిర్వర్తించిన వీసీ సజ్జనార్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీగా నియమించింది. మూడేళ్లకు పైగా సైబరాబాద్ సీపీగా పనిచేశారు సజ్జనార్. ఈ సమయంలోనే దిశా హత్యాచారం కేసు కూడా జరిగింది. ఈ వ్యవహారాన్ని డీల్ చేసిన విధానం, నిందితుల ఎన్‌కౌంటర్‌తో సజ్జనార్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ప్రజలు ఆయనను హీరోగా చూశారు.

ALso Read:సజ్జనార్ ఆకస్మిక బదిలీ: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్ర

ఇక స్టీఫెన్ రవీంద్ర విషయానికి వస్తే.. పోలీస్ శాఖలో సమర్థుడైన అధికారిగా ఆయనకు పేరు వుంది. ఉమ్మడి రాష్ట్రంలో నక్సల్స్‌ ఆటకట్టించడంతో పాటు సంఘ  వ్యతిరేక శక్తుల పాలిట సింహాస్వప్నంగా నిలిచారు. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. స్వయంగా నాటి ఉద్యమ నేతలు కేటీఆర్, హరీశ్‌లు పలు సందర్భాల్లో స్టీఫెన్ రవీంద్రను టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించిన దాఖలాలు ఎన్నో. 

Follow Us:
Download App:
  • android
  • ios