సైబరాబాద్ పోలీస్ కమీషనర్‌గా సీనియర్ ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సీపీగా విధులు నిర్వర్తించిన వీసీ సజ్జనార్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీగా నియమించింది. 

సైబరాబాద్ పోలీస్ కమీషనర్‌గా సీనియర్ ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సీపీగా విధులు నిర్వర్తించిన వీసీ సజ్జనార్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీగా నియమించింది. మూడేళ్లకు పైగా సైబరాబాద్ సీపీగా పనిచేశారు సజ్జనార్. ఈ సమయంలోనే దిశా హత్యాచారం కేసు కూడా జరిగింది. ఈ వ్యవహారాన్ని డీల్ చేసిన విధానం, నిందితుల ఎన్‌కౌంటర్‌తో సజ్జనార్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ప్రజలు ఆయనను హీరోగా చూశారు.

ఇక స్టీఫెన్ రవీంద్ర విషయానికి వస్తే.. పోలీస్ శాఖలో సమర్థుడైన అధికారిగా ఆయనకు పేరు వుంది. ఉమ్మడి రాష్ట్రంలో నక్సల్స్‌ ఆటకట్టించడంతో పాటు సంఘ వ్యతిరేక శక్తుల పాలిట సింహాస్వప్నంగా నిలిచారు. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. స్వయంగా నాటి ఉద్యమ నేతలు కేటీఆర్, హరీశ్‌లు పలు సందర్భాల్లో స్టీఫెన్ రవీంద్రను టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించిన దాఖలాలు ఎన్నో.