వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. 2019-20 ఏడాదిలో భారీగా జరిమానాలు వసూలు చేశారు. రెండేళ్లలో రూ.165 కోట్లను జరిమానా కింద వసూలు చేశారు.

అలాగే మద్యం తాగి వాహనాలు నడిపిన 3,551 మంది లైసెన్సులు రద్దు చేశామని.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 42 మంది మహిళలపై కేసులు నమోదు చేశామని సైబరాబాద్ పోలీసులు తెలిపారు.

మద్యం తాగి 854 మంది విద్యార్ధులు  పోలీసులకు చిక్కారు. అలాగే 75 మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, 2,431 మంది వ్యాపారవేత్తలు, 6,340 మంది ప్రైవేట్, 222 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసుల నమోదు చేశారు.