కాగ్నిజెంట్ సంస్థ హైదరాబాద్ హెడ్ ప్రశాంత్ మాట్లాడుతూ.. సైబరాబాద్ పోలీసులు చేస్తున్న కృషిని కొనియాడారు. ఐటీ కారిడార్ ని రక్షించడానికి సైబరాబాద్ పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారన్నారు.
ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ ఉద్యోగులతో సైబరాబాద్ పోలీసులు చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వీసీ సజ్జనర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాగ్నిజెంట్ సంస్థ హైదరాబాద్ హెడ్ ప్రశాంత్ మాట్లాడుతూ.. సైబరాబాద్ పోలీసులు చేస్తున్న కృషిని కొనియాడారు. ఐటీ కారిడార్ ని రక్షించడానికి సైబరాబాద్ పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వారికి ఆయన దన్యవాదాలు తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించుకొని తెలంగాణ పోలీసులు రాష్ట్ర ప్రజలకు రక్షణ కలిపిస్తున్నారన్నారు. షీటీమ్స్, సేఫ్టీ యాప్స్, కమాండ్ కంట్రోల్ సెంటర్, నగరమంతా సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేయడం లాంటివన్నీ చేశారన్నారు. తమ ఐటీ ఉద్యోగుల భద్రత కోసం చేయాల్సిన అన్ని పనులు నగర పోలీసులు పూర్తి చేశారని అభినందించారు.
అనంతరం సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ కాగ్నిజెంట్ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ...తమ పోలీసులు నిర్వర్తిస్తున్న పలు విషయాలను ప్రస్తావించారు. ప్రజలకు అవసరమైనప్పుడు వెంటనే స్పందించేందుకు తీసుకుంటున్న చర్యలు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేందుకు వాట్సాప్, ట్విట్టర్ లాంటి వాటిని వినియోగిస్తున్నట్లు చెప్పారు.
ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, సూసైడ్స్ లాంటివి చేయకుండా నగర, విలేజ్ లో వారికి కూడా అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ఆపరేషన్ స్మైల్ పేరిట 105మంది చిన్నారులను స్ట్రీట్స్, హార్డ్ లేబర్ నుంచి రక్షించినట్లు తెలిపారు. ఆ చిన్నారులను వారి తల్లిదండ్రుల దగ్గరికి చేర్చినట్లు చెప్పారు. నగరమంతా సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేశామని.. వాటి సహాయంతో చాలా నేరాలను పరిష్కరించామన్నారు.

అనంతరం.. కాగ్నిజెంట్ ఉద్యోగులు పోలీసులను పలు విషయాలపై ప్రశ్నలు అడగగా.. వారు వాటికి సమాధానం చెప్పారు. ఈ కార్యక్రమంలో టాప్ ర్యాకింగ్ ఐపీఎస్ అధికారులు ఎస్ఎం విజయ్ కుమార్, షీ టీమ్ కి చెందిన సి. అనసూయ, వుమెన్ ప్రొటెక్షన్ సెల్ అండ్ క్రైమ్ బ్రాంచ్ ఇందిర, భరణి తదితరులు పాల్గొన్నారు.
