హైదరాబాద్:నకిలీ ఆర్మీ అధికారినంటూ పలువురిని బెదిరిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

మంగళవారం నాడు సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు.నకిలీ ఆర్మీ అధికారుల ముఠాను అరెస్ట్ చేసినట్టుగా ఆయన చెప్పారు. నకిలీ ఐడీ కార్డులు, తుపాకులతో నిందితులు బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా ఆయన వివరించారు. 

రఘువర్మ అలియాస్ కార్తీక్ ను పోలీసులు తెలిపారు. రెండు దఫాలు కార్తీక్ ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీల్లో పాల్గొన్నాడు. అయితే అప్పటికే ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. దీంతో ఆయనకు ఉద్యోగం రాలేదని సజ్జనార్ చెప్పారు.

నకిలీ ఆర్మీ గుర్తింపు కార్డులను తయారు చేసుకొన్నాడు. అదే విధంగా ఆర్మీ అధికారులు ధరించే దుస్తులను కూడ కొనుగోలు చేసినట్టుగా ఆయన తెలిపారు.పరమ్ వీర్ చక్ర, భారత రత్న మినహా మిగిలిన అన్ని రకాల మెడల్స్ ను తయారు చేయించుకొన్నాడని సీపీ చెప్పారు.

ఎయిర్ రైఫిల్స్ ను , డమ్మీ ఫిస్టల్ ను కొనుగోలు చేసినట్టుగా సజ్జనార్ వివరించారు.ఆర్మీలో మేజర్‌నని, కల్నల్ నని చెప్పుకొనేవాడని విచారణలో తేలిందన్నారు.  ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసినట్టుగా సీపీ తెలిపారు.రామచంద్రాపురంతో పాటు పలు పోలీస్ స్టేషన్లలో రఘుపై కేసులు నమోదు చేసినట్టుగా ఆయన వివరించారు.