Asianet News TeluguAsianet News Telugu

నేను సింగిల్.. హగ్ ఇస్తారా అంటూ...

రోడ్డు మీద ఆడపిల్లలను వేధిస్తూ.. హగ్ కావాలంటూ వెంటపడేవాడు. ఒంటిపై షర్ట్ కూడా లేకుండా తిరుగుతూ వేధించేవాడు. ప్రాంక్ వీడియో అతను చేసిన పని చాలా మందికి నచ్చకపోవడం గమనార్హం.

Cyberabad crime branch  officers file a case against the youth who post prank video in youtube
Author
Hyderabad, First Published Apr 4, 2020, 9:25 AM IST

రోడ్డు మీద ఓ అబ్బాయి నిలబడి.. నాకు హగ్ ఇస్తారా అంటూ అమ్మాయిలను అడిగితే ఎలా ఉంటుంది..? ఎవరైనా షాకైపోతారు కదా.. తీరా అదంతా ప్రాంక్ అంటూ ఓవర్ యాక్షన్ చేశాడు. గతంలో పాశ్చాత్యదేశాల్లో ఉండే ఈ విష సంస్కృతి ఇప్పడు మన నగరానికి కూడా పాకేసింది. తాజాగా.. ఓ యువకుడు చేసిన ప్రాంక్ వీడియోతో అడ్డంగా బుక్కయ్యాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే... ‘నేను సింగిల్‌ అండి... నాకు ఓ హగ్‌ ఇస్తారా? అంటూ రోడ్డు మీద పోయే అమ్మయిలను అడుగుతాడు. ఈ మేరకు ప్రాంక్‌ పేరిట వీడియో రూపొందించిన ‘డ్రీమ్‌ బాయ్‌ జయసూర్య’ అనే యూట్యూబ్‌ చానల్‌ నిర్వాహకుడు రమావత్‌ సురేష్‌..తన చానల్‌లో వీడియోను పోస్టు చేశాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇద్దరు యువతులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read లాక్ డౌన్..మహిళ మృతి, అంత్యక్రియలు చేసేవారు లేక.....

ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులుదర్యాప్తు చేపట్టారు. ఈ తరహా కేసు నమోదు కావడం నగరంలో ఇదే తొలిసారి. సురేష్‌ గత కొన్నాళ్లుగా డ్రీమ్‌ బాయ్‌ జయసూర్య పేరుతో ఓ చానల్‌ నిర్వహిస్తున్నాడు. 

రోడ్డు మీద ఆడపిల్లలను వేధిస్తూ.. హగ్ కావాలంటూ వెంటపడేవాడు. ఒంటిపై షర్ట్ కూడా లేకుండా తిరుగుతూ వేధించేవాడు. ప్రాంక్ వీడియో అతను చేసిన పని చాలా మందికి నచ్చకపోవడం గమనార్హం.

 దాదాపు పది నిమిషాల నిడివితో ఉన్న దీన్ని తన యూట్యూబ్‌ చానల్‌ డ్రీమ్‌బాయ్‌ జయసూర్యలో పొందుపరిచాడు. ప్రతి సీన్‌ను వెనుక బ్యాక్‌ గ్రౌండ్‌ సాంగ్స్, మ్యూజిక్‌ ఏర్పాటు చేశాడు. దీన్ని ఇప్పటి వరకు 12 లక్షల మంది వీక్షించారు. ప్రతి సీన్‌ ముగిసిన తర్వాత ఇది ప్రాంక్‌ వీడియో అంటూ వారికి చెబుతూ..అదిగో అక్కడ కెమెరా ఉంది, హాయ్‌ చెప్పండి అంటూ సూచించాడు. 

అయితే ఇద్దరు యువతుల విషయంలో మాత్రం వారికి ఇలా చెప్పలేదు. యూ ట్యూబ్‌ చానల్‌లో ఉన్న ఆ వీడియో ఇటీవల ఈ ఇద్దరు యువతుల దృష్టికి వచ్చింది. తమ అనుమతి లేకుండా రూపొందించిన వీడియోను చానల్‌లో పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నగర సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios