Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్..మహిళ మృతి, అంత్యక్రియలు చేసేవారు లేక..

లాక్ డౌన్ తో ఆమెకు పనిలేకుండా పోయింది. దీంతో.. కుటుంబ పోషణ భారమైంది. దానికి తోడు ఆమెకున్న అనారోగ్యం మరింత క్షీణించింది. దీంతో మృతిచెందింది. పిల్లలు కూడా చిన్నవారు కావడంతో అంత్యక్రియలు కూడా చేయలేదు. ఈ బాధాకర సంఘటన ఈ ఘటన సికింద్రాబాద్ పరిధిలో వెలుగుచూసింది.

daily labour died  in telangana over lockdown
Author
Hyderabad, First Published Apr 3, 2020, 12:42 PM IST

కరోనా వైరస్ కేసులు దేశంలో రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ ని అరికట్టేందుకు మూడు వారాలపాటు లాక్ డౌన్ ప్రకటించారు. అయితే.. ఈ లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు, రోజూ కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. కనీసం తినడానికి తిండి కూడా దొరకక ఇబ్బంది పడుతున్నారు. తాజాగా.. ఓ హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఆమెకు భర్త లేడు.. నలుగురు పిల్లలను కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేది. అయితే.. లాక్ డౌన్ తో ఆమెకు పనిలేకుండా పోయింది. దీంతో.. కుటుంబ పోషణ భారమైంది. దానికి తోడు ఆమెకున్న అనారోగ్యం మరింత క్షీణించింది. దీంతో మృతిచెందింది. పిల్లలు కూడా చిన్నవారు కావడంతో అంత్యక్రియలు కూడా చేయలేదు. ఈ బాధాకర సంఘటన ఈ ఘటన సికింద్రాబాద్ పరిధిలో వెలుగుచూసింది.

Also Read కరోనాను జయించిన రాజమండ్రి యువకుడు, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్...

పూర్తి వివరాల్లోకి వెళితే...చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మేడిబావిలో రాధ(28) అనే మహిళ నెల రోజుల క్రితం ఓ ఇంటికి అద్దెకు తీసుకుంది. ఆమెకు నలుగురు పిల్లలు. భర్త చనిపోవడంతో కూలి పనులు చేసి పిల్లలను పోషిస్తోంది. 

లాక్‌డౌన్ కారణంగా పది రోజుల నుంచి బయటకు రాలేదు. బుధవారం మధ్యాహ్నం అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో ఇంటి యజమాని స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తరలించాడు. తల్లి మృతదేహం వద్ద నలుగురు పిల్లలు రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.

ఆమె సంబంధీకుల వివరాలు తెలియకపోవడంతో గురువారం మధ్యాహ్నం వరకు మృతదేహం అక్కడే ఉండిపోయింది. దుర్వాసన రావడంతో స్థానికులు చిలకలగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాసేపటికే వారు అక్కడికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. 

ఆమె నెల రోజుల క్రితమే ఇంటిని అద్దెకు తీసుకోవడంతో పూర్తి వివరాలు తనకు తెలియవని ఇంటి యజమాని తెలిపారు. పిల్లలు కూడా బంధువుల వివరాలు చెప్పలేకపోవడంతో పోలీసులు మున్సిపాలిటీ సిబ్బంది సాయంతో మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. బంధువుల సమాచారం తెలుసుకుని నలుగురు పిల్లలను వారికి అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios