Asianet News TeluguAsianet News Telugu

షాదీ ముబారక్ డబ్బును కాజేసిన సైబర్ కేటుగాళ్లు: లబ్ధిదారుడికి చేరకుండానే గోల్‌మాల్

పేదింటి వధువులకు ప్రభుత్వం అందజేస్తున్న షాదీ ముబారక్ సాయాన్ని సైతం సైబర్ నేరగాళ్లు వదిలిపెట్టడం లేదు. హైదరాబాద్ చాంద్రాయణ గుట్టలో ఈ పథకం ద్వారా వచ్చిన డబ్బును కాజేశారు

cyber crime in shadi mubarak sheme
Author
Hyderabad, First Published Aug 22, 2020, 5:18 PM IST

పేదింటి వధువులకు ప్రభుత్వం అందజేస్తున్న షాదీ ముబారక్ సాయాన్ని సైతం సైబర్ నేరగాళ్లు వదిలిపెట్టడం లేదు. హైదరాబాద్ చాంద్రాయణ గుట్టలో ఈ పథకం ద్వారా వచ్చిన డబ్బును కాజేశారు.

వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 8న షాదీ ముబారక్ డబ్బులు లబ్ధిదారుడికి మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో బండ్లగూడ రెవెన్యూ అధికారులు ఫిబ్రవరి 22న ఇందుకు సంబంధించిన చెక్కును అందజేశారు.

అయితే లబ్ధిదారుడికి డబ్బు అందకముందే తమిళనాడులోని ఎస్‌బీఐలో ఫిబ్రవరి పదిన లక్ష రూపాయల చెక్‌ను ఎన్‌ క్యాష్ చేశారు కేటుగాళ్లు. ఆలస్యంగా వెలుగుచూసిన  ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు రెవెన్యూ అధికారుల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios