Asianet News TeluguAsianet News Telugu

సైబర్ క్రైమ్: అరుదైన ఫారెస్ట్ ఆయిల్.. వ్యాక్సిన్లలో వాడతారు, బిజినెస్ సూపర్ అంటూ రూ.11 కోట్ల టోకరా

ఫారెస్ట్ ఆయిల్ పేరుతో హైదరాబాద్‌లో భారీ మోసం వెలుగుచూసింది. ఆయిల్ పేరుతో రూ.11 కోట్ల మేర బాధితులకు టోకరా పెట్టారు కేటుగాళ్లు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

cyber crime hyderabadi person lost rs 11 crore in the name of forest oil ksp
Author
Hyderabad, First Published Aug 5, 2021, 6:59 PM IST

పోలీసులు ఎంతగా నిఘా పెడుతున్నా.. రోజు కేసులు బయటపడుతూనే ఉన్నప్పటికీ సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతూనే వున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఫారెస్ట్ ఆయిల్ పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. ఆయిల్ పేరుతో రూ.11 కోట్ల మేర బాధితులకు టోకరా పెట్టారు కేటుగాళ్లు. ఫేస్‌బుక్‌తో గీతా నారాయణ్ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు.. అమెరికాలో ఖరీదైన ఆయిల్ బిజినెస్ట్ చేస్తున్నట్లు నమ్మించారు. వ్యాక్సిన్ తయారయ్యే అగ్రో సీడ్ ఆయిల్ సప్లయ్ చేస్తామని నమ్మించారు. ఇది నిజమేనని నమ్మిన బాధితుడు .. విడతలవారీగా రూ.11 కోట్లను ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశాడు. తర్వాత మోసం గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios