Asianet News TeluguAsianet News Telugu

వివాహితపై కన్నేసిన ఈ దుర్మార్గుడు ఎంత పని చేశాడో తెలుసా?

వివాహిత భర్త హత్యకు పథకం 

custody closed malyadri case in hyderabad-

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో వివాహితపై కన్నేసి ఆమెను భర్త నుండి విడదీయాలని క్రిమినల్ ప్లాన్ వేసిన ఓ దుర్మార్గుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యా భర్తలను విడదీయాలని అతడు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరకు వివాహిత భర్తను హతమార్చడానికి పథకం పన్నాడు. ఈ హత్య కోసం కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చాడు. అయితే ఇంతలోనే ఈ విషయం బైటపడి పోలీసులకు చిక్కాడు.

ఈ ఘటనకు సంబంధిచిన వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ అపోలో ఆస్పత్రిలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న మాల్యాద్రి కృష్ణానగర్ లో నివాసముండే ఓ  మహిళతో పరిచయం పెంచుకున్నాడు. అయితే ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని వివాహితను ఆమె భర్త నుండి వేరుచేసి తాను సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం ఓ క్రిమినల్ ప్లాన్ రచించాడు.

సదరు మహిళకుఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రిలో ఉద్యోగం వచ్చినట్లు బోగస్‌ అపాయింట్‌మెంట్‌ లెటర్‌ సృష్టించాడు. అయితే ఆమె భర్త ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి హెచ్ఆర్ కు తన భార్య క్యారెక్టర్ గురించి చెడుగా ప్రస్తావిస్తూ రాసినట్లు కొన్ని లెటర్లు రాసి భార్యాభర్తల మద్య చిచ్చు పెట్టాలని చేశాడు. అంతే కాకుండా అపోలో ఆస్పత్రికి కూడా తన భార్యకు అపోలోలో పనిచేసే యాల్యాద్రికి సంంభందం ఉన్నట్లుగా లెటర్ రాశాడు. ఇలా భార్యాభర్తల మద్య గొడవలు పెట్టి వివాహితను తన వశం చేసుకోవాలనుకున్నాడు. 

అయితే ఈ ప్లాన్ ఫలించకపోవడంతో ఆమె భర్తను హతమార్చాలని మరో పథకం వేశాడు. అయితే చివరకు విషయం బైటపడి పోలీసులకు చిక్కాడు. అపోలో, ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రుల నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లు, భర్త రాసినట్లుగా లేఖలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  నిందితుడు మాల్యాద్రిని అరెస్ట్‌ చేసి కోర్టు ముందు హాజరుపర్చిన పోలీసులు  మరింత సమాచారం రాబట్టేందుకు  కోర్టు అనుమతితో రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios