పెద్ద నోట్ల రద్దుతో అయోమయం

currency
Highlights

అమెరికా ఎన్నికల ఊసే లేదు. బుధవారం నుండి  ఇంగ్లాండ్ తో ప్రారంభమవుతున్న క్రికెట్ మ్యాచ్ గురించే మాట్లాడుతున్న గొంతులన్నీ ఒక్క సారిగా మూతపడిపోయాయి. కారణం రూ. 1000, 500 నోట్లను రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం చేసిన ప్రకటనే.

 

అమెరికా ఎన్నికల ఊసే లేదు. బుధవారం నుండి  ఇంగ్లాండ్ తో ప్రారంభమవుతున్న క్రికెట్ మ్యాచ్ గురించే మాట్లాడుతున్న గొంతులన్నీ ఒక్క సారిగా మూతపడిపోయాయి. కారణం రూ. 1000, 500 నోట్లను రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం చేసిన ప్రకటనే. కేంద్ర ప్రకటన ఎప్పుడైతే వెలువడిందో వెంటనే ప్రజలు తమ ఉన్న పెద్ద నోట్ల మార్పిడికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే, కొత్తగా ముద్రించిన రూ. 2000, 500 నోట్లు చాలినంత చెలామణిలోకి రాలేదు.

దానికితోడు బుధవారం బ్యాంకులు మూసేస్తున్నట్లు కేంద్రం ప్రకటించటంతో పాటు ఏటిఎంలను కూడా బుధ, గురువారాలు మూసేస్తున్నట్లు చేసిన ప్రకటన మరింత గందరగోళానికి దారితీసింది. దాంతో తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను ఏ విధంగా మార్పిడి చేసుకోవాలో అర్ధం కాక అయోమయంలో పడిపోయారు. ఇదిలావుండగా, కేంద్ర నిర్ణయంతో ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు ఒక్కసారిగా విరుచుకుపడుతున్నాయి.

ప్రధానమంత్రి రూ.1000, రూ. 500 నోట్లను రద్దతో తీసుకున్న సంచలన నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు మొదలయ్యాయి. దానికితోడు ఇప్పటి వరకూ చెలామణిలో ఉన్న పెద్ద కరెన్సీ నోట్ల స్ధానంలో కొత్తగా ముద్రించిన రూ. 2000, రూ. 500 నోట్లను చెలామణిలోకి తెస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోడి చేసిన ప్రకటన మరింత గందరగోళానికి దారి తీసింది. అసలే మొదటి వారం, పైగా జీతాలు అందుకున్న వెంటనే పై నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించటం ప్రజల దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

   అద్దెలు, చెల్లించటం, వెచ్చాలు తెచ్చుకోవటం, ఇవ్వాల్సిన వారికి డబ్బులు ఇచ్చుక్కోవటం లాంటివి ఇంకా ప్రజలు పూర్తిగా చేయలేదు. దాంతో మంగళవారం రద్దు ప్రకటన వెలువడిన దగ్గర నుండి పై నోట్ల చెలామణి దాదాపు ఆగిపోయింది. ఇచ్చేవాళ్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా ఎవ్వరూ తీసుకోవటం లేదు. ప్రభుత్వం పెట్రోలు బంకులు, ఆసుపత్రులు, రవాణా వ్యవస్ధలో పై నోట్లు చెల్లుతాయని ప్రభుత్వం చెప్పినా ఎవ్వరూ తీసుకోవటం లేదు. వంద రూపాయల కోసం ప్రజలు ఏటిఎంల వద్దకు బారులు తీరటంతో అవి కూడా పనిచేయటం మానేసాయి.

  దేశంలో పెరిగిపోతున్న నల్లధనాన్ని నియంత్రించటం, దొంగనోట్ల చెలామణిని అరికట్టాలన్న ఏకైక ఉద్దేశ్యంతో 1000, 500 నోట్లను రద్దు చేసినట్లు చెబుతున్నప్పటకి ప్రభుత్వ ఉద్దేశ్యం నెరవేరటం అంటుంచి దేశవ్యాప్తంగా అయోమయం నెలకొంది. ఒక అంచనా ప్రకారం దేశం మొత్తం మీద రూ. 1.25 లక్షల కోట్ల దొంగనోట్లు చెలామణిలో ఉంది. దేశ ఆర్ధిక వ్యవస్ధను ప్రక్షాళన చేసేందుకే తాను  ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానమంత్రి చెబుతున్నారు.

  నల్లధనం, దొంగనోట్ల చెలామణిని అరికట్టే విషయంలో ప్రభుత్వం నోట్లను రద్దు చేయటం ఇదే మొదటిసారి కాదు. 1946 జనవరిలో తొలిసారి రిజర్వ్ బ్యాంకు వెయ్యి, పదివేల నోట్లను రద్దు చేసింది. ఆ తర్వాత 1954లో వెయ్యి, ఐదు వేలు, 10 వేల నోట్లను రద్దు చేసింది. తరువాత 1978లో 10 వేలు, 5 వేలు, వెయ్యి నోట్లను రద్దు చేసింది. ఆ తర్వాత మళ్ళీ నోట్లను రద్దు చేయటం ఇదే.

 

  ఇకపోతే కొత్తగా చెలామణిలోకి తీసుకువస్తున్న 2000 నోట్లకు దొంగనోట్లను రూపొందించేందుకు వీలు లేని విధంగా ముద్రించినట్లు కేంద్రం చెబుతోంది.  ముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెతను కేంద్రం అనుసరిస్తున్నది. ఎందుకంటే 2000 నోటు ముద్రణలో నానో టెక్నాలజీ చిప్ ను ఉపయోగించింది. దీని వల్ల ఉపగ్రహం నుచి వచ్చే సిగ్నల్ ను ఈ నోటు గ్రహిస్తుంది. దాంతో ఈ నోటు ఏ ప్రాంతంలో చెలామణి అవుతోందో స్పష్టంగా ఉపగ్రహం ద్వరా తెలుసుకోవచ్చు.

 ఇందుకు కొత్తగా మరేవిధమైన పరికరాన్ని వినియోగదారులు ఉపయోగించక్కర్లేదు. ఉపగ్రహంకు,నోటుకు మధ్య చిప్ ద్వరా సిగ్నల్ ప్రసారాలు అవుతుంటాయి. ఈ నోటును ఏమూల దాచిపెట్టినా, లేదా ఎంతలోతులో పాతిపెట్టినా 2000 నోటు ఉనికిని ఉపగ్రహం ఇట్టే పట్టేస్తుంది.  ఒకవేళ ఈ నోటును మరో చిప్ తో పనిచేయించాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఈ నోటు ఎందుకూ పనికిరాకుండా పోతుంది. ఈ కొత్త పద్దతితో ఏనోటు ఎంత కాలం చెలామణిలో ఉన్నది, ఎంతకాలంగా చెలామణ కాకుండా ఉన్నదన్న విషయం స్పష్టమైపోతుంది. దాంతో నర్దిష్ట కాలం కన్నా చెలామణిలోకి రాకాండా ఉంటే సదరు నోట్లన్నీ బ్లాక్ మనీగా కేంద్రం నిర్ధారించుకునే అవకాశాలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

loader