కరోనా క్లిష్ట పరిస్థితుల్లో వున్న దేశాన్ని ఆదుకునేందుకు కార్పోరేట్లు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, మందులు, వెంటిలేటర్లు ఇలాంటి వాటిని కంపెనీలు అందజేస్తున్నాయి. ఈ క్రమంలో మేఘా ఇంజనీరింగ్ సంస్థ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది

కరోనా క్లిష్ట పరిస్థితుల్లో వున్న దేశాన్ని ఆదుకునేందుకు కార్పోరేట్లు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, మందులు, వెంటిలేటర్లు ఇలాంటి వాటిని కంపెనీలు అందజేస్తున్నాయి. ఈ క్రమంలో మేఘా ఇంజనీరింగ్ సంస్థ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. ఆక్సిజన్‌ కొరత తీర్చేందుకు గాను థాయ్ లాండ్ నుంచి క్రయోజెనిక్ ఆక్సీజన్ ట్యాంకర్లను తెప్పించింది. ఇవి థాయిలాండ్‌ నుంచి శుక్రవారం బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాయి.

రెండవ దశలో భాగంగా బేగంపేట ఎయిర్‌పోర్ట్ కు ఐఏఎఫ్ ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్‌కు చేర్చింది. వీటిని తెలంగాణ ఆరోగ్య శాఖకు అందజేయనున్నారు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు. ఒక్కో‌ ట్యాంకర్ ద్వారా కోటి 40 లక్షల లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పతి అవుతుంది.

Also Read:2-డీజీ సాచెట్ ధర ప్రకటించిన రెడ్డీస్ ల్యాబ్స్.. ఒక్క ప్యాకెట్ ఎంతంటే...

ప్రతి క్రయోజెనిక్ ట్యాంకర్‌లో 1.40 కోట్ల లీటర్ల ఆక్సిజన్ ఉంటుందన్నారు. పెద్ద సంఖ్యలో ట్యాంకర్లను దిగుమతి చేసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి. వీటి ద్వారా తెలంగాణలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కష్టాలు తీరే అవకాశం ఉంది. ప్రస్తుతం, భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యంగా మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు 7 వేల లీటర్లు గల ఆక్సిజన్‌ సిలిండర్లను ప్రతి రోజు కనీసం పది ఆస్పత్రులకు సంస్థ ఉచితంగా సరఫరా చేస్తోంది. ఈ విధంగా ఇప్పటి వరకు 4,242 సిలిండర్లను వివిధ ఆస్పత్రులకు అందజేసింది. ఇందుకోసం మేఘా ఇంజనీరింగ్ కార్పొరేషన్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.