Asianet News TeluguAsianet News Telugu

ఓ కానిస్టేబుల్ నిర్వాకం.. భార్య, కొడుకుతో పాటు ఇంటి సామాను బజార్న..

కట్టుకున్న భార్యను, కన్నపిల్లల్ని.. డొంకలో వదిలేసి పారిపోయాడో జవాను. జనాల్ని కాపాడాల్సిన కానిస్టేబుల్ కనీసం భార్య, బిడ్డల్ని కూడా రక్షించడం మాని అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేశాడు. వినలేదని ఈ నిర్వాకానికి తెగబడ్డాడు. 

CRPF constable harassed wife for dowry in Warangal - bsb
Author
Hyderabad, First Published Jan 11, 2021, 9:18 AM IST

ట్టుకున్న భార్యను, కన్నపిల్లల్ని.. డొంకలో వదిలేసి పారిపోయాడో జవాను. జనాల్ని కాపాడాల్సిన కానిస్టేబుల్ కనీసం భార్య, బిడ్డల్ని కూడా రక్షించడం మాని అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేశాడు. వినలేదని ఈ నిర్వాకానికి తెగబడ్డాడు. 

మూడేళ్ల కుమారుడితో, ఇంటి సామానుతో బీడులాంటి ఈ భూమిలో కూర్చున్న ఈమె పేరు దీప. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌కు చెందిన సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఓంకార్‌తో 2013లో వివాహమైంది. 

పెళ్లైన నాటి నుంచి కొద్ది రోజులు కట్నంగా ఇచ్చిన భూమి తన పేరున రాసివ్వలేదని వేధించేవాడు. ఆ తర్వాత మరికొన్నాళ్లు అనుమానంతోనూ వేధించేవాడు. ఒకసారి ఈ వేధింపులు తట్టుకోలేక అతనిపై కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం దీప రెండు నెలల గర్భిణి. ఈ క్రమంలో ఈ నెల 3న ఓంకార్‌ తాగొచ్చి కత్తితో బెదిరించాడు. సర్దిచెప్పడానికి వచ్చిన ఆమె తండ్రి, సోదరుడిపై చెప్పుతో దాడిచేశాడు. 

అంతేగాకుండా శనివారం ఇంట్లోని సామానంతా కట్నంగా రాసిచ్చిన భూమిలో పడేసి వెళ్లిపోయాడని, అందుకే అక్కడే కూర్చుని న్యాయం కోసం ఆందోళనకు దిగినట్టు దీప వివరించింది. కాగా, పోలీసులు దంపతులిద్దరినీ స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios