హైదరాబాద్ అత్తాపూర్‌లో మూసీనదిలో మొసలి కలకలం రేపింది. మొసలి వచ్చినట్లుగా తెలియడంతో దానిని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. 

హైదరాబాద్ అత్తాపూర్‌లో మూసీనదిలో మొసలి కలకలం రేపింది. హిమాయత్‌సాగర్, గండిపేటల నుంచి వచ్చిన వరద నీటితో పాటు మొసలి కొట్టికొచ్చినట్లుగా తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. మరోవైపు మొసలి వచ్చినట్లుగా తెలియడంతో దానిని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో అత్తాపూర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.