అనుచిత వ్యాఖ్యలు: మహేష్ కత్తిపై క్రిమినల్ కేసు

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 8, Sep 2018, 11:04 AM IST
Criminal case booked against mahesh Kathi
Highlights

సినీ క్రిటిక్ మహేష్ కత్తిపై హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా టీవీ చర్చల్లో మాట్లాడారనే ఆరోపణలపై ఆ కేసు నమోదైంది. 

హైదరాబాద్‌: సినీ క్రిటిక్ మహేష్ కత్తిపై హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా టీవీ చర్చల్లో మాట్లాడారనే ఆరోపణలపై ఆ కేసు నమోదైంది. 

గత జూన్‌ 29న బంజారాహిల్స్‌లోని ఓ తెలుగు న్యూస్‌ ఛానెల్‌లో జరిగిన చర్చావేదికలో పాల్గొన్న కత్తి మహేష్‌ రామాయణంలో రాముడు సీతపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, దానివల్ల హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయని ఆరోపిస్తూ అదే రోజు యూసుఫ్‌గూడ సమీపంలోని రహ్మత్‌నగర్‌కు చెందిన గడ్డం శ్రీధర్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

ఈ ఫిర్యాదుపై పోలీసులు న్యాయ సలహా తీసుకున్న తర్వాత శుక్రవారం కత్తి మహేష్‌పై ఐపీసీ సెక్షన్‌ 295(ఏ), 505(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

loader