హైదరాబాద్: పాతబస్తీకి వెళ్లి  ముఖ్యమంత్రిని అని చెప్పుకొనే ధైర్యం కేసీఆర్ కుఉందా అని  సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ  సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. కేసీఆర్ దుష్టకూటమికి నాయకుడు ఘాటుగా విమర్శించారు. 

సోమవారం నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన  ప్రజా కూటమి సభలో  సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ చెప్పారు.ముఖ్యమంత్రి కాకముందు  మెట్రోను  అడ్డుకోవాలని కేసీఆర్  తనకు ఫోన్ చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ ప్రశ్నించారు.

మెట్రో‌ను అడ్డుకోవాలని  తనకు ఫోన్ చేశాడని...ఈ విషయమై తన మద్దతును  కేసీఆర్  కోరాడని ఆయన గుర్తు చేశారు. మెట్రో రావాల్సిందేనని తాను ఆనాడూ కేసీఆర్ పోరాటానికి మద్దతివ్వలేదన్నారు.

మెట్రో  అలస్యానికి  కేసీఆర్ కారణమన్నారు. ఇప్పుడు మెట్రోకు ఎంఐఎం అడ్డుపడుతోందన్నారు.దేశమంతా మోడీని నిలదీస్తోంటే  కేసీఆర్ ఒక్క మాటైనా మాట్లాడాడా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్, మోడీని ఓడించడమే తక్షణ కర్తవ్యమన్నారు.

వీళ్లా హైద్రాబాద్ ను అభివృద్ధి చేసిందని నారాయణ ప్రశ్నించారు.  ఉత్తర, దక్షిణ దృవాల లాంటి కాంగ్రెస్, టీడీపీలు కలవడానికి  బీజేపీ, టీఆర్ఎస్ లు కారణమన్నారు. ఓల్డ్ సిటీకి వెళ్లి తాను ముఖ్యమంత్రిని అని చెప్పే ధైర్యం కేసీఆర్ కు ఉందా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కు ఇసుక దందా ఉందన్నారు. ఇసుక దందాను  నిరూపిస్తానని నారాయణ సవాల్ విసిరారు.