హైద్రాబాద్  లోని  ఆర్ బీ ఐ కార్యాలయం ముందు  సీపీఐ శ్రేణులు ఇవాళ ఆందోళన నిర్వహించాయి.  అదానీ  కంపెనీల  వ్యవహరంపై   విచారణకు డిమాండ్  చేస్తూ సీపీఐ శ్రేణులు  నిరసనకు దిగాయి.

హైదరాబాద్: నగరంలోని ఆర్ బీ ఐ కార్యాలయం ముందు సోమవారం నాడు సీపీఐ శ్రేణులు ధర్నా నిర్వహించారు. అదానీ వ్యవహరంపై విచారణ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ శ్రేణులు ఆందోళనకు దిగారు. సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సహ ఆ పార్టీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అదానీ కంపెనీలపై హిడెన్ బర్గ్ నివేదిక విషయమై జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు ఈ విషయమై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ విషయమై పార్లమెంట్ ఉభయ సభలను విపక్షాలు స్ధంభింపజేస్తున్నాయి.