భారతదేశంలో లౌకికతత్వం ప్రమాదంలో పడిందని సీపీఐ జాతీయ ప్రధాన  కార్యదర్శి డీ రాజా అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దేశంలో సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు.

భారతదేశంలో లౌకికతత్వం ప్రమాదంలో పడిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దేశంలో సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు. ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభలో తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు పినరయి విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీ రాజా మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నివాళులర్పిస్తున్నట్టుగా చెప్పారు. 

తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నివాళులర్పిస్తున్నట్టుగా చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో సుపరిపాలన అందుతుందని తెలిపారు. విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. రైతు బంధు, దళిత బంధు, కంటి వెలుగు వంటి పథకాలు ఆదర్శనీయమని ప్రశంసించారు. అయితే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వల్ల భారత్ హిందూ దేశంగా మారే ప్రమాదం కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. భారతదేశం హిందూ దేశంగా మారితే ప్రమాదమని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆనాడే హెచ్చరించారని అన్నారు. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ అని అంటారు.. కానీ అంబానీ, అదానీతో మోదీ ఉన్నారని విమర్శించారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విఘాతం కలిగిస్తున్నారని.. దేశం పెద్ద విపత్తును ఎదుర్కొంటుందని విమర్శించారు. దీనిని అడ్డుకోవడానికి అవసరం అందరిపై ఉందన్నారు. 

Also Read: బీజేపీని తరిమికొట్టే కార్యక్రమం తెలంగాణ నుండే ప్రారంభం కావాలి: ఖమ్మం సభలో అఖిలేష్ యాదవ్

విద్య, వైద్య, ఆరోగ్యం వంటి ప్రజల ప్రాథమిక అవసరాలను కేంద్రం విస్మరిస్తుందని మండిపడ్డారు. ప్రధాని మోదీ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉండి బీజేపీ గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థతో రాష్ట్ర ప్రభుత్వాల హక్కుల్లో జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. కేరళ, ఢిల్లీ, తమిళనాడు, తెలంగాణలో గవర్నర్లు ప్రభుత్వాలను ఇబ్బందిపెట్టేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇదేనా ఫెడరల్ స్పూర్తి అంటూ కేంద్రంపై మండిపడ్డారు. 

బీజేపీని ఒడించడానికి అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అందరం కలిసి కట్టుగా పోరాడితేనే విజయం చేకూరుతుందని ధీమా వ్యక్తం చేశారు. సెక్యులర్ డెమొక్రటిక్ పార్టీలు, శక్తులు బీజేపీకి వ్యతిరేకంగా ఏకతాటిపైకి వచ్చి దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.