Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు ఖరారు

కాంగ్రెస్ తో సీపీఐ పొత్తులో భాగంగా ఎమ్మెల్సీ,  కొత్తగూడెం సీటు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఖమ్మంలో సీపీఎంకు ఒక సీటు ఇవ్వాలని కోరింది సీపీఐ.

CPI alliance with Congress finalized in telangana - bsb
Author
First Published Nov 4, 2023, 11:00 AM IST

హైదరాబాద్ : కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు ఓకే అయ్యింది. సీపీఐకి కొత్తగూడెం సీటు మరో ఎమ్మెల్సీ ఆఫర్ చేసింది కాంగ్రెస్. ఈ సందర్భంగా సిపిఎంతో పొత్తు విషయం కూడా సీపీఐ చర్చించినట్లు సమాచారం. సీపీఎంకి ఓ సీటు ఇవ్వాలని సిపిఐ సూచించింది. అయితే, అధిష్టానంతో సిపిఎం జాతీయ నేతలు మాట్లాడుతున్నారన్న రేవంత్ రెడ్డి వారికి తెలిపారు. ఖమ్మంలో సీపీఎంకు ఒక సీటు ఇవ్వాలని కోరింది సీపీఐ. ఇక మునుగోడులో ఫ్రెండ్లీ పోటీ చేయాలన్న దానిపై కూడా చర్చలు జరిగాయి. శుక్రవారం రాత్రి రేవంత్ రెడ్డితో సీపీఐ ముఖ్యలు భేటీ అయ్యారు.  దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios