రోడ్డు ప్రమాదంలో గాయపడిన జంటను ఆసుపత్రికి తరలించిన భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పెట్రోల్ మొబైల్ టీంను రాచకొండ సిపి ప్రశంసించారు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. 

బుధవారం నాడు సాయంత్రం 6.45 నిమిషాలకు  భోంగిర్ భువనగిరి రూరల్ పోలీసు పెట్రోలింగ్ మొబైల్ బృందం రాయిగిరి సమీపంలో వాహన తనిఖీ విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో యదగిరిగుట్ట రోడ్డులో ప్రమాదం జరిగిందని కొంతమంది పోలీసులకు తెలిపారు.

యదగిరిగుట్ట రోడ్డులోని మల్లనా ఆలయం సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగిందని.. దీనికి బాధ్యులెవరూ కాదని, వారే ప్రమాదవశాత్తు బండి స్కిడ్ అయి ప్రమాదం జరిగిందని సమాచారం ఇచ్చారు. 

వెంటనే మొబైల్ పెట్రోల్ టీం పోలీస్ పిసి 3847 రామ్‌నార్సింహ, డ్రైవర్ హెచ్‌జీ 788 కోటయ్య ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ ఓ దంపతులు గాయాలతో బాదపడుతున్నారు. దీంతో వీరికి పోలీసులు ఫస్ట్ ఎయిడ్ చేసి,పోలీసు పెట్రోలింగ్ మొబైల్ వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

గాయపడిన జంటను వలిగొండ మండల్, రెడ్ల రేపాక గ్రామానికి చెందిన జురాగాని శేఖర్, ఆయన భార్యగా గుర్తించారు. వీరికి భువనగిరి జిహెచ్ లో చికిత్స చేయించారు. కోలుకున్న తరువాత వీరు తమను సమయానికి ఆదుకున్న పోలీసులకు వీరు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ విషయం తెలిసిన సిపి రాచకొండ మహేష్ భగవత్ ఐపిఎస్.. ఆ పోలీసుల సమయస్ఫూర్తి,  మానవత్వాన్ని మెచ్చుకున్నారు. భువనగిరి ప్రజలు కూడా పోలీసుల ఈ చర్యలనుప్రశంసించారు. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యాయత్నాల సమయాల్లో ఎలా రెస్పాండ్ కావాలో రాచకొండ పోలీసులకు ఇచ్చిన శిక్షణ ఇలాంటి అనేక కేసులలో సహాయపడిందని ఆయన మహేష్ భగవత్ అన్నారు.