బీదర్ లో డోర్ టు డోర్ సెర్చ్ ఆపరేషన్, మీడియా సపోర్ట్ వల్లే పాప ఆచూకీ గుర్తించాం : సిపి అంజనీ కుమార్

CP Anjani Kumar Press Meet over Koti Hospital Baby Kidnap Case
Highlights

కోఠి మెటర్నిటి హాస్పిటల్ లో పాప కిడ్నాప్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు ఎలా చేధించారో నగర్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ వివరించారు. పాపను సురక్షితంగా కాపాడటంతో బీదర్ లోని లోకల్ మీడియాతో పాటు తెలుగు మీడియా ఎంతగానో సహకరించిందని తెలిపారు. ప్రతి నిమిషం మీడియాలో వస్తున్న వార్తలను చూసే నిందితురాలు భయపడిపోయిందని అన్నారు. దీంతో పట్టుబడతానన్న భయంతోనే చిన్నారిని హాస్పిటల్లో వదిలిపెట్టిందని తెలిపారు.

ఇక పాప ఆచూకీ తెలుసుకోవడంలో సిసి పుటేజీలు చాలా ఉపయోగపడ్డాయని అన్నారు. ఎంజీబిఎస్ తో పాటు బీదర్ లో కూడా వీటిని పరిశీలించి నిందితురాలిని పట్టుకోడానికి ప్రయత్నించినట్లు ఆయన తెలిపారు. ఇలా సిసి కెమెరాల ఏర్పాటు వల్ల నగరంలో కూడా నేరాల శాతం తగ్గిందని, ప్రతి ప్రదేశంలోను సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

హైదరాబాద్, బీదర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ చాలా సక్సెస్ ఫుల్ గా సాగిందన్నారు. బీదర్ లో డోర్ టు డోర్ తనిఖీ చెపట్టామని ఆయన తెలిపారు. ఈ కేసు విషయంలో బీదర్ పోలీసులు ముఖ్యంగా జిల్లా ఎస్పీ ఎంతగానో సహకరించారని అన్నారు. ఇక ఏసిపి చేతన బీదర్ కు వెళ్లి పాప కోసం జరుగుతున్న గాలింపు చర్యలకు నాయకత్వం వహించారని, ఆమెతో పాటు పోలీస్ టీం చాలా కష్ట పడ్డారని తెలిపారు. 

 ఈ పోలీస్ ఆపరేషన్ గురించి మీడియా ద్వారా నిందితురాలు నైనా తెలుసుకుంది. ఎలాగైనా పోలీసులు తన ఆచూకీ తెలుసుకుంటారని  భయపడిపోయి తన సోదరుల సాయంతో శిశువును ప్రభుత్వ ఆస్పత్రిలో వదిలిపెట్టి వెళ్లిపోయింది. ఈ విషయం పోలీసులకు తెలిసి శిశువును అక్కడ్నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించినట్లు సిపి తెలిపారు. 

అయితే ఈ కేసులో మానవతా కోణం కూడా దాగిఉందని ఆయన అన్నారు. పాప దొరికాక వారిని పరామర్శించానని ఆసందర్భంగా తల్లిదండ్రులు పాపకు చేతన అని పేరు పెడతామని చెప్పారని తెలిపారు. ఇది పోలీసులకు ఆదర్శవంతంగా కూడా ఉంటుందని అంజనీకుమార్ అన్నారు.

loader