కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేసింది. మన దేశంలోనూ తీవ్రంగా విజృంభించింది. అయితే.. ఈ మధ్యకాలంలో ఈ మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. కేసులు కూడా చాలా తక్కువగా నమోదౌతున్నాయి. వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. 

అయితే.. చాలా మందిలో ఈ మహమ్మారిపై భయం మాత్రం పోలేదు అనిపిస్తోంది. ఈ క్రమంలోనే  ఓ రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌లో ఓ కోవిడ్ పెషేంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆస్పత్రి రెండో అంతస్తు నుంచి దూకి బలవనర్మణం చెందాడు. వేములవాడకు చెందిన 77 ఏళ్ల నారాయణ.. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. వ్యాపారిగా జీవనం సాగిస్తున్న అతడికి ఇద్దరు కొడుకులు. అయితే ఇటీవల కరోనా సోకడంతో కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రిలో చికిత్స ఆయన బిల్డింగ్ రెండో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఈ ఘటనపై ఆస్పత్రి యజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆత్మహత్య చేసుకున్న పేషేంట్ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కొండాపూర్‌లోని కిమ్స్ హాస్పిటల్‌లో బుధవారం చేరాడని పేర్కొంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడికి ఆదివారం ఉదయం 9.30 గంటలకు అక్కడ పనిచేస్తున్న నర్సు మెడికేషన్‌కు సిద్దం చేస్తోంది. 

అయితే ఆ ఆస్పత్రి రెండో అంతస్తులో ఉన్న కోవిడ్ 19 వార్డు నుంచి దూకి నారాయణ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ నారాయణ మృతిచెందాడని తెలిపారు.

కరోనా పాజిటివ్ రావడంతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పలువురు చెబుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు.