కరీంనగర్: ఇండోనేషియా బృందం పర్యటన కారణంగా కరీంనగర్ పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరీంనగర్ పట్టణంలొ అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకొన్నారు.

ఇండోనేషియా బృందానికి ఆశ్రయం కల్పించిన వ్యక్తికి కూడ కరోనా పాజిటివ్ పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. ఆ వ్యక్తిని కూడ ఐసోలేషన్ వార్డుకు తరలించారు.కరీంనగర్ కలెక్టరేట్ కు సమీపంలో ఇండోనేషియా బృందం తిరిగినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో ప్రజలు రాకపోకలు సాగించకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. 

Also read:కరోనా దెబ్బ: ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా వేసిన సర్కార్

పట్టణంలోని పలు వార్డులను రెడ్ జోన్ గా ప్రకటించారు. పలు అనుమానితుల నుండి శాంపిల్స్ సేకరించారు. వీటి రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రం నుండి 97 మంది శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపారు. ఇవాళ ఈ రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంది.తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 33 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

కరీంనగర్ పట్టణంలో రోడ్లపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలు రోడ్లపైకి వస్తే పోలీసులు వారిపై చర్యలు తీసుకొంటున్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా కరీంనగర్ పట్టణంలో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదు కావడంపై జిల్లా యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యలు తీసుకొంటుంది.