Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రజ్యోతి ఎండీకి కరోనా రావాలన్న కేసీఆర్.. విజయశాంతి చురకలు

వైద్య సదుపాయాలు లేవన్నందుకే ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు కరోనా రావాలన్న సీఎం కేసీఆర్... గాంధీ ఆస్పత్రి జైలులా మారిందంటూ వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం శాసనసభ సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీకి ఎలాంటి శాపనార్థాలు పెడతారంటూ తెలంగాణ ప్రజలు భయపడుతున్నారని విజయశాంతి అన్నారు. 

congress Leader vijayashanthi fire on CM Kcr Over MIM leader comments
Author
Hyderabad, First Published Apr 25, 2020, 11:09 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి మండిపడ్డారు. కరోనా వైరస్ విషయంలో తెలంగాణలో సీఎం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయంపై మద్దతు ప్రకటించిన విజయశాంతి.. ఈ సారి మాత్రం మండిపడ్డారు. 

ఇటీవల గాంధీలో సరైన వైద్య సదుపాయాలు లేవన్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు కరోనా వైరస్ రావాలంటూ సీఎం కేసీఆర్ పెట్టిన శాపం పెడుతూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. విజయశాంతి మండిపడ్డారు.

వైద్య సదుపాయాలు లేవన్నందుకే ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు కరోనా రావాలన్న సీఎం కేసీఆర్... గాంధీ ఆస్పత్రి జైలులా మారిందంటూ వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం శాసనసభ సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీకి ఎలాంటి శాపనార్థాలు పెడతారంటూ తెలంగాణ ప్రజలు భయపడుతున్నారని విజయశాంతి అన్నారు. 

ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్టు  చేశారు. ‘హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న తీరుపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ గారు చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగింది. ప్రపంచమంతా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న తరుణంలో.. కొన్ని లోపాలున్నా... వాటిని పట్టించుకోకుండా అందరూ ప్రభుత్వానికి బాసటగా నిలవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఈ మధ్య ప్రెస్‌మీట్‌లో స్పష్టం  చేశారు. అంతటితో ఆగకుండా గాంధీ ఆస్పత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేవని రాసిన కారణంగా ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ గారికి కరోనా రావాలని  కేసీఆర్ గారు శాపం పెట్టారు.’

‘వైద్య సదుపాయాలు లేవు అన్నందుకే కరోనా రావాలన్న కేసీఆర్ గారు... మరి గాంధీ ఆసుపత్రి జైలు మాదిరిగా ఉందని విమర్శించిన అక్బరుద్దీన్ గారిపై ఎలాంటి శాపనార్థాలు పెడతారోననీ తెలంగాణ ప్రజలు భయపడుతున్నారు. గాంధీ ఆసుపత్రి జైలు లాగా ఉందని విమర్శించిన అక్బరుద్దీన్ గారికి బహుశా కేసీఆర్ గారు పెట్టిన శాపం గురించి తెలిసి ఉండకపోవచ్చు. లేదా కేసీఆర్ గారు... తాను ఒకటే కనుక ఈ శాపాలు తనకు వర్తించవని అక్బరుద్దీన్ గారిలో ధీమా ఉండి ఉండొచ్చు. లేదా మాకు ఈ శాపాలు తగలవని... తాము అన్నిటికీ అతీతమని అక్బరుద్దీన్ గారు భావించి ఉండొచ్చు. మరి రాబోయే రోజుల్లో అక్బరుద్దీన్ కామెంట్స్‌పై కేసీఆర్ గారు శాపం పెడతారా? లేక చూసీ చూడకుండా సర్దుకుపోతారా అనే విషయాన్ని వేచి చూడాలి’’ అంటూ విజయశాంతి తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios