Asianet News TeluguAsianet News Telugu

ఆక్స్‌ఫర్డ్ బాటలో హైదరాబాద్ సైతం: నిమ్స్‌ క్లినికల్ ట్రయల్స్‌లో తొలి విజయం

ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తూ మానవాళికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు

covaxin trail in nims hyderabad two volunteers discharged
Author
Hyderabad, First Published Jul 22, 2020, 2:29 PM IST

ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తూ మానవాళికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వ్యాక్సిన్ ట్రయల్స్‌లో అన్ని దేశాలు బిజీగా వున్నాయి.

మన భారతదేశంలో కూడా ప్రముఖ ఫార్మా కంపెనీలు టీకాపై కసరత్తు చేస్తున్నాయి. దీనిలో భాగంగా హైదరాబాద్ నిమ్స్‌లో నిర్వహిస్తున్న తొలి దశ కరోనా వ్యాక్షిన్ క్లినికల్ ట్రయిల్స్ ఆశాజనక ఫలితాలను  ఇస్తున్నాయి.

భారత్ బయెటెక్ సంస్థ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను సోమవారం ఇద్దరు వాలంటీర్లకు ఇచ్చారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో మంగళవారం ఇరువురిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు.

Also Read:కరోనా వ్యాక్సిన్: హైద్రాబాద్ నిమ్స్ లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం

ట్రయల్స్‌లో పాల్గొన్న ఇద్దరు వాలంటీర్ల ఆరోగ్యాన్ని 14 రోజుల పాటు పర్యవేక్షించి.. వారి రక్తనమూనాలను పరీక్షించిన తర్వాతే రెండో డోస్ ఇస్తామని పరిశోధకులు తెలిపారు. ఈ టీకా తీసుకున్న వారిలో అలర్జీ, ఇతర ఆరోగ్య సమస్యలు ఏవి లేవని వారు చెప్పారు.

కాగా కొవాక్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్‌లో మొదటి ప్రయత్నం విజయవంతమైందని.. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ అయిన మరో ఇద్దరికీ ఇవాళ నిమ్స్ డాక్టర్లు టీకా డోస్ ఇవ్వనున్నారు.

ఈ టీకా క్లినికల్ ట్రయల్స్‌ను రెండు మూడు నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నామని కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. మరోవైపు క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ అయిన మరో ఇద్దరికీ బుధవారం నిమ్స్ వైద్యులు టీకా డోస్ ఇవ్వనున్నారు.

ఈ ట్రయల్స్‌ను రెండు లేదా మూడు నెలల్లో పూర్తి చేయాలనుకుంట్లున్నట్లు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ పరీక్షలు కనుక విజయవంతమైతే.. 2020 డిసెంబర్ లేదా 2021 మొదట్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు రానున్నాయి. 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios