హైదరాబాద్ లో దారుణం జరిగింది. వావివరసలు మరిచి తమ్ముడు, అక్కపైనే వేధింపులకు పాల్పడ్డాడు. వరుసకు సోదరి అవుతుందని కూడా ఆలోచించకుండా సోషల్ మీడియా వేదికగా వేధింపులకు పాల్పడ్డాడో దుర్మార్గుడు.

తరచూ అసభ్యకరమైన సందేశాలు పంపిస్తూ, లైంగి వాంఛ తీర్చాలని పదే పదే వేధించాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆ యువతి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

హైదరాబాద్ లోని ఓ యువతికి వరుసకు తమ్ముడయ్యే వ్యక్తి సోషల్‌ మీడియాలో తరచూ అసభ్య సందేశాలు పంపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. యువతి ఎన్నిసార్లు వారించినా అతని నుంచి సందేశాలు ఆగలేదు. దీంతో విసిగిపోయిన యువతి గురువారం సీసీఎస్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఆ యువకుడిపై ఫిర్యాదు చేసింది.

అసభ్య మెసేజ్ లతో ఆగకుండా ఆ యువకుడు లైంగిక వాంఛ తీర్చాలని ఆ యువతిని పదేపదే వేధించాడు. దీంతో ఈ కేసుపై విచారణ జరిపిన పోలీసులు ఆ యువకున్ని అరెస్ట్ చేసినట్టు సీసీఎస్‌ సైబర్‌ క్రైం పోలీసులు తెలిపారు.