Asianet News TeluguAsianet News Telugu

స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబాటు.. డిప్యూటీ తహసీల్దార్ సహా మరొకరికి రిమాండ్

ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లో చొరబడిన డిప్యూటీ తహసీల్దార్ సహా, మరో వ్యక్తికి రిమాండ్ విధించారు మేజిస్ట్రేట్. వీరిపై అక్రమ చొరబాటు, న్యూసెన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 

court sent to jail on 14-day remand deputy tahsildar for enter into smitha sabharwal house
Author
First Published Jan 22, 2023, 2:30 PM IST

తెలంగాణ సీఎంవో కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లో చొరబడిన డిప్యూటీ తహసీల్దార్ సహా, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. అనంతరం వీరికి 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. అనంతరం వీరిద్దరిని చంచల్ గూడకు జైలుకు తరలించారు పోలీసులు. వీరిపై అక్రమ చొరబాటు, న్యూసెన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 

కాగా.. మేడ్చల్ జిల్లాలోని  డిప్యూటీ తహసీల్దార్ గా  పని చేస్తున్న ఆనంద్ కుమార్ రెడ్డి   రెండు రోజుల క్రితం అర్ధరాత్రి సీనియర్ ఐఎఎస్ అధికారి స్మితా సభర్వాల్ నివాసానికి వచ్చారు. అర్ధరాత్రి పూట తన నివాసానికి  అపరిచిత వ్యక్తి రావడంపై  ఆమె  షాక్ కు గురయ్యారు. అపరిచిత వ్యక్తి అర్ధరాత్రి పూట తన నివాసానికి  చేరుకోవడంపై  ఆమె  షాక్ కు గురయ్యారు. ఎవరని ఆమె అతడిని ప్రశ్నించారు. తాను  డిప్యూటీ తహసీల్దార్‌నని చెప్పాడు. తన విధుల విషయంలో ఇబ్బందులున్నాయని  ఐఎఎస్ అధికారికి చెప్పారు. ఈ విషయమై మాట్లాడేందుకు  వచ్చినట్టుగా  అతను చెప్పిన సమాధానం విన్న ఐఎఎస్ అధికారి  అతనిపై మండిపడ్డారు. తన నివాసం వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందిని పిలిచారు. దీంతో భద్రతా సిబ్బంది  వెంటనే  ఆనంద్ కుమార్ రెడ్డిని, అతని మిత్రుడిని పట్టుకుని  స్థానిక పోలీసులకు  అప్పగించారు.

ALso Read: ఆ సమయంలో ఎలా రక్షించుకోవాలో ఆలోచించా: సీనియర్ ఐఎఎస్ స్మితా సభర్వాల్ 

ఇదిలావుండగా.. తన ఇంట్లోకి  అపరిచిత వ్యక్తి  చొరబడిన సమయంలో  తనను తాను రక్షించుకోవడంపై  దృష్టి పెట్టినట్టుగా  స్మితా సభర్వాల్  చెప్పారు. ఈ విషయమై  ట్విట్టర్ వేదికగా  స్మితా సభర్వాల్ స్పందించారు. తన ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడినట్టుగా  చెప్పారు. ఆ రోజు రాత్రి తనకు బాధాకరమైన అనుభవం కలిగిందన్నారు. తనను తాను చాకచక్యంగా  రక్షించుకున్నట్టుగా  ఆమె వివరించారు. మీరు ఎంత సురక్షితంగా  ఉన్నారని భావించినా  ఎల్లప్పుడూ తలుపులు, తాళాలను తనిఖీ చేసుకోవాలని  ఆమె సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో  100 నెంబర్ కు డయల్ చేయాలని సూచించారు.

Follow Us:
Download App:
  • android
  • ios