శిల్పా చౌదరికి బెయిల్ మంజూరు.. కానీ జైల్లోనే, ఎందుకంటే..?

కిట్టీ పార్టీలు, అధిక వడ్డీ, పెట్టుబడులు పేరిట సినీ, రాజకీయ ప్రముఖులకు కోట్లాది రూపాయలు కుచ్చుటోపీ పెట్టిన కిలాడీ లేడీ శిల్పా చౌదరికి (shilpa chowdary) ఎట్టకేలకు బెయిల్ (bail) లభించింది. ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ ఉప్పర్‌పల్లి కోర్టు (upparpally court) గురువారం ఆదేశాలు జారీ చేసింది.

court sanctioned bail for shilpa chowdary in cheating case

కిట్టీ పార్టీలు, అధిక వడ్డీ, పెట్టుబడులు పేరిట సినీ, రాజకీయ ప్రముఖులకు కోట్లాది రూపాయలు కుచ్చుటోపీ పెట్టిన కిలాడీ లేడీ శిల్పా చౌదరికి (shilpa chowdary) ఎట్టకేలకు బెయిల్ (bail) లభించింది. ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ ఉప్పర్‌పల్లి కోర్టు (upparpally court) గురువారం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. వారిలో దివ్యారెడ్డి అనే మహిళ ఫిర్యాదు చేసిన కేసులోనే శిల్పకు బెయిల్‌ మంజూరైంది. మరో రెండు కేసుల్లో బెయిల్‌ లభించలేదు. దీంతో ఆమె జైలులోనే ఉండనుంది.

మంగళవారం నాడు శిల్పా చౌదరిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని... బ్యాంకు లాకర్లను తెరిచారు. అయితే అందులో నగదు లభ్యం కాలేదు. కస్టడీ పూర్తి కావడంతో బుధవారం ఉదయం ఉప్పర్‌పల్లి కోర్టులో నార్సింగి పోలీసులు ప్రవేశ పెట్టారు. దీంతో శిల్పా చౌదరికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమెను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు పోలీసులు

ALso Read:శిల్పా చౌదరికి 14 రోజుల రిమాండ్: చంచల్‌గూడ్ జైలుకు తరలింపు

అయితే ప్రముఖుల నుండి వసూలు చేసిన డబ్బులను మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పెట్టుబడులుగా పెట్టినట్టుగా శిల్పా చౌదరి పోలీసుల విచారణలో వెల్లడించారని సమాచారం.  సినీ నటుల కుటుంబాలతో పాటు పోలీస్ అధికారులు, వీఐపీలను లక్ష్యంగా చేసుకొని  శిల్పా చౌదరి డబ్బులను వసూలు చేసిందని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం గత వారంలో మూడు రోజుల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకొన్నారు. కానీ ఆమె కస్టడీలో ఆమె నోరు విప్పలేదు.  

అంతేకాదు  శని, ఆదివారాలు కూడా కావడంతో బ్యాంకు లావాదేవీలను తెలుసుకొనే అవకాశం లేకుండా పోయిందని  పోలీసులు చెబుతున్నారు. దీంతో  ఆమెను మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఉప్పర్‌పల్లి కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ప్రముఖులను లక్ష్యంగా చేసుకొని వారి నుండి డబ్బులు వసూలు చేసేందుకు కిట్టీ పార్టీలను ఏర్పాటు చేసేదని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఎక్కువ వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయాలను వసూలు చేసిందని ఆమెపై పలువురు ఫిర్యాదు చేశారు.

వీటి ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.  ఎన్నారై ప్రతాప్ రెడ్డి, మల్లారెడ్డి, రాధికారెడ్డిల నుండి తనకు డబ్బులు రావాల్సి ఉందని శిల్పా చౌదరి పోలీసుల విచారణలో తెలిపిందని సమాచారం. శిల్పా చౌదరి చెప్పిన సమాచారం ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. ఎన్నారై ప్రతాప్ రెడ్డికి పోలీసులు ఫోన్ చేశారు. అయితే ఎన్నారై ప్రతాప్ రెడ్డి మాత్రం పోలీసులకు భిన్నమైన సమాధానం చెప్పారని తెలుస్తోంది. తనకే ఆమె డబ్బులు ఇవ్వాలని  చెప్పారని తెలుస్తోంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios