హైదరాబాద్: ఏపీ సీఎం వైఎస్ జగన్ పై కేసు ఉపసంహరణకు తెలంగాణ ప్రజా ప్రతినిధుల  కోర్టు గురువారం నాడు అనుమతి ఇచ్చింది.ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని జగన్ పై ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ పోలీసులు జగన్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసు ఉపసంహరణకు కోర్టు అనుమతి ఇచ్చింది.

ప్రజా ప్రతినిదులపై నమోదైన కేసులను సత్వరమే విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకొంది.ఈ నేపథ్యంలో గురువారం నాడు జగన్ పై కోదాడ పోలిస్ స్టేషన్ లో నమోదైన కేసుపై ప్రజా ప్రతినిదులపై కేసులను విచారిస్తున్న కోర్టు విచారించింది.

2014లో ఎలాంటి అనుమతి లేకుండా  ర్యాలీ నిర్వహించారని కోదాడ పోలీసులు జగన్ పై నమోదైన కేసును విచారించింది కోర్టు. ఈ కేసును ఉపసంహరించుకొనేందుకు కోర్టు పోలీసులకు అనుమతిని ఇచ్చింది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను త్వరగా విచారించేందుకు సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల హైకోర్టులను ఆదేశించింది. 

ఆయా రాష్ట్రాల్లో ప్రజా ప్రతినిదులపై నమోదైన కేసులను త్వర త్వరగా కోర్టులు విచారణ పూర్తి చేస్తున్నాయి.