హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ వ్యవహారంలో ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను శుక్రవారం నాటికి సికింద్రాబాద్ కోర్టు వాయిదా వేసింది.

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియకు బెయిల్ మంజూరు చేయాలని సికింద్రాబాద్ కోర్టులో ఆమె తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై కోర్టులో విచారణ సాగింది. ఏ2గా ఉన్న అఖిలప్రియను ఏ1 గా మార్చారని కనీసం ఈ విషయాన్ని అఖిలప్రియకు సమాచారం కూడ ఇవ్వలేదని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అఖిలప్రియకు 41 సీఆర్‌పీసీ ముందస్తు నోటీసులు ఇవ్వలేదని గుర్తు చేశారు.

also read:బోయిన్‌పల్లి కిడ్నాప్: ఏ1 గా భూమా అఖిలప్రియ, రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

అఖిలప్రియకు ఆరోగ్యం బాగా లేనందున బెయిల్ మంజూరు చేయాలని  న్యాయవాదులు కోరారు. ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను సికింద్రాబాద్ కోర్టు ఆదేశించింది.కౌంటర్ దాఖలు చేయాలని సికింద్రాబాద్ కోర్టు పోలీసులను ఆదేశించింది.

అఖిలప్రియకు గైనిక్ ట్రీట్ మెంట్ జరుగుతుందని కోర్టుకు న్యాయవాది తెలిపారు.అక్టోబర్ నుండి పీసీఓడీ చికిత్స తీసుకొంటున్నారని అఖిలప్రియ న్యాయవాది కోర్టుకు తెలిపారు.  జైల్లో సదుపాయాలు లేవని మెరుగైన సదుపాయాలు లేవని న్యాయవాది చెప్పారు. మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రిలో చికిత్స అందించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అఖిలప్రియ న్యాయవాది కోరారు.