తెలంగాణలో డైనమిక్ అధికారిగా పేరు తెచ్చుకున్న కలెక్టర్ ఆమ్రపాలికి భారీ షాకింగ్ న్యూస్ ఇది. ఆమెకు కోర్టులో చేదు వార్త ఎదురైంది.

వరంగల్ నగరంలోని ఒక ఐసిడిఎస్ కేంద్రానికి గత మూడేళ్లుగా భవన కిరాయి చెల్లించడంలేదు. ఈ విషయంలో ఆ భవన యజమాని ఎన్నిసార్లు రెంట్ చెల్లించాలని కోరినా... స్పందన రాలేదు.

ఈ విషయంలో కిరాయి కోసం పలుమార్లు నోటీసులు కూడా జారీ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆయన వరంగల్ కోర్టును ఆశ్రయించారు.

దీంతో తనకు బిల్డింగ్ రెంట్ 3లక్షలు రావాల్సి ఉందని, వాటిని వెంటనే ఇప్పించాలని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై కోర్టులో ఆ యజమానికి అనుకూలంగా తీర్పు వచ్చింది.

కలెక్టర్ అద్దె చెల్లించడంలో జాప్యం చేసినందుకు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఈ జాప్యానికి కారణమైన కలెక్టర్ ఆమ్రపాలి వాహనాన్ని సీజ్ చేయాలని కోర్టు ఆదేశించింది.