హైదరాబాద్: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై  కోర్టు సోమవారం నాడు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.2016లో టీపీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్, ఆ పార్టీ నేత షబ్బీర్ అలీలు ప్రయాణీస్తున్న కారును కొందరు వ్యక్తులు అడ్డుకొన్నారు. కారులో ప్రయాణీస్తున్న మాజీ మంత్రి షబ్బీర్ అలీపై దాడి చేశారు. ఈ విషయమై అప్పట్లో కాంగ్రెస్ నేతలు మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈ కారుపై ఎంఐఎం నేతలు దాడికి దిగారని అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అసద్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. 

అయితే ఈ దాడిలో తన పాత్ర లేదని గతంలోనే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.  దాడికి పాల్పడుతున్నవారిని తాను అడ్డుకొన్నట్టుగా ఆయన పేర్కొన్నారు.