ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైకు ఈడీ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైకు ఈడీ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారంలో విచారణ జరుపుతున్న ఈడీ.. అరుణ్ రామచంద్ర పిళ్లైను గతవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అడిగిన కోర్టులో హాజరుపరుచగా.. కోర్టు మార్చి 13 వరకు ఈడీ కస్టడీ విధించింది. అయితే నేటితో రామచంద్ర పిళ్లై కస్టడీ ముగియడంతో.. ఈడీ అధికారులు నేడు అరుణ్ రామచంద్ర పిళ్లైను కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా రామచంద్ర పిళ్లై కస్టడీ పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు.
మనీలాండరింగ్ వ్యవహారాలకి సంబంధించి.. సౌత్ గ్రూప్‌లోని వ్యక్తులను ప్రశ్నించాల్సి ఉందని ఈడీ అధికారులు కోర్టు తెలిపారు. ఈ కేసులో సౌత్ గ్రూప్‌కు సంబంధించిన ఆడిటర్ బుచ్చిబాబును ఈ నెల 15న విచారణకు హాజరుకానున్నారని.. బుచ్చిబాబును, రామచంద్ర పిళ్ళైని కలిసి విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే రామచంద్ర పిళ్లై ఈడీ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరో మూడు రోజులు పొడిగించింది.
