జనగామ జిల్లా కలెక్టరేట్ దగ్గర వద్ద దంపతులు ఆత్మహత్యకు యత్నించడం తీవ్ర కలకలం రేపింది. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. 

జనగామ జిల్లా కలెక్టరేట్ దగ్గర వద్ద దంపతులు ఆత్మహత్యకు యత్నించడం తీవ్ర కలకలం రేపింది. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. వివరాలు.. జనగామ మండలం పసరమడ్లకు చెందిన నర్సింగరావు, రేవతి దంపతులు ఈ రోజు ఉదయం కలెక్టరేట్ వద్దకు వచ్చారు. చాలా కాలంగా తమ భూ సమస్య పరిష్కారం కావడం లేదంటూ ఆందోళనకు దిగారు. తమకు భూసమస్య ఉందని.. అధికారుల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కలెక్టరేట్ భవనం ఎక్కి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. 

పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడికి చేరుకుని వారిని అడ్డుకుని.. బలవంతంగా కిందకు తీసుకొచ్చారు. అనంతరం వారిపై నీళ్లు చల్లారు. అయితే భూ సమస్య పరిష్కారం కావడం లేదని.. గతంలో కూడా నర్సింగరావు దంపతులు ఆత్మహత్యకు యత్నించినట్టుగా తెలుస్తోంది.