Asianet News Telugu

అప్పులు తీర్చడానికి కీడ్నీలు అమ్ముకోవాలనుకుంటే.. సైబర్ నేరగాళ్ల వలలో పడి...!!

తమకు అప్పులిచ్చిన వారికి  ఎలాగైనా తిరిగి ఇవ్వాలని భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మాభిమానంతో మూత్రపిండాలు అమ్ముకోవడానికి నిర్ణయించుకున్నారు. కిడ్నీలు కొనే వారి గురించి దంపతులు గూగుల్లో అన్వేషించారు. 

Couple duped of Rs 40 lakh by cyber fraudsters in Hyderabad - bsb
Author
Hyderabad, First Published Jul 14, 2021, 12:01 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

నారాయణ గూడ : అప్పులు తీర్చేందుకు మూత్రపిండాలు అమ్ముకోవడం మినహా మరో మార్గం లేదని భావించి.. వాటిని కొనే వారి కోసం ఆన్లైన్లో వెతికిన దంపతులకు సైబర్ మోసగాళ్లు మాయమాటలు చెప్పి రూ. 40.38 లక్షల వరకు కాజేశారు.  దీనిపై బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ కెవిఎం ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఉండే మోదీ వెంకటేష్, లావణ్య దంపతులు స్థానికంగా స్టేషనరీ బ్యాంగిల్ స్టోర్ నిర్వహిస్తున్నారు.

రెండేళ్ల క్రితం సొంతింటి నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఇందుకు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ద్వారా మొదట 34 లక్షలు.. తర్వాత మరో పది లక్షలు రుణం తీసుకున్నారు.  నాలుగు అంతస్తుల ఇల్లు సిద్ధమయ్యే సరికి రూ. 1.50 కోట్లు అప్పులు అయ్యాయి.  కరోనా లాక్డౌన్ తో వ్యాపారం దాదాపు మూతపడింది. మరోవైపు అప్పులిచ్చినవారి నుంచి ఒత్తిడి పెరిగింది. 

తమకు అప్పులిచ్చిన వారికి  ఎలాగైనా తిరిగి ఇవ్వాలని భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మాభిమానంతో మూత్రపిండాలు అమ్ముకోవడానికి నిర్ణయించుకున్నారు. కిడ్నీలు కొనే వారి గురించి దంపతులు గూగుల్లో అన్వేషించారు. మొదట ఓ వ్యక్తి పరిచయమై కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు కడితే చాలు అన్నాడు. ఆ తర్వాత కిడ్నీకి బీమా, కరెన్సీ ఎక్స్చేంజి కోసమంటూ మొత్తం పది లక్షల వరకు కట్టించుకున్నాడు.  

అతనికి డబ్బులు ఇవ్వలేక మరొక వ్యక్తిని సంప్రదించారు.  అతను రూ. 12 లక్షల వరకు  కట్టించుకున్నాడు. ఇలా మొత్తం నలుగురిని ఆన్లైన్లో సంప్రదించారు.  ఓ వ్యక్తి కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు కడితే.. రావాల్సిన మొత్తంలో సగం ఖాతాలో వేస్తానని నమ్మించాడు.  

బ్లఫ్ మాస్టర్ : ఉన్నతవర్గాలే టార్గెట్.. నకిలీ ఆధార్ తో మోసాలు.. పేరు కూడా ఫేకే...!

చెప్పినట్లే రెండు ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు కనిపించాయి.  రెండు మూడు రోజుల్లో ఆ డబ్బులు తీసుకోవచ్చు అని చెప్పాడు. కానీ,విత్ డ్రా  చేద్దామంటే రాలేదు.  అతన్ని తిరిగి సంప్రదించగా ఆర్థిక శాఖ, ఎయిర్పోర్స్ అథారిటీ, ఆదాయపన్ను శాఖ సర్టిఫికెట్లు అవసరమంటూ డబ్బులు కట్టించుకున్నాడని బాధిత దంపతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

మరో వ్యక్తి డబ్బులు తీసుకునేందుకు బెంగళూరుకు వస్తే తమ మనుషులు అడ్వాన్స్ చెల్లిస్తారు అని చెప్పాడు. అది నిజమేనని నమ్మి వారు అక్కడికి వెళ్లారు.  ఇద్దరు వ్యక్తులు వచ్చి లాకర్ తెరిచి డబ్బులు చూపించారు. నోట్లు నలుపు రంగులో ఎందుకు ఉన్నాయ్ అని ప్రశ్నించగా ఇదంతా ఆర్.బి.ఐ డబ్బు అని రసాయనాలతో శుభ్రం చేయాల్సి ఉంటుందని చెప్పారు. కొన్నింటిని శుభ్రం చేసి చూపించారు. వాటిని ఓ ప్యాకెట్లో కట్టి ఇచ్చి 48 గంటల వరకు తెరవకూడదు అన్నారు. 

ముంబై నుంచి రసాయనాలు తెప్పించాలి అంటూ వారూ డబ్బులు కట్టించుకున్నారని ఇందుకు తెలిసిన వారి దగ్గర బంగారాన్ని తాకట్టు పెట్టినట్లు దంపతులు తెలిపారు. తీరా హైదరాబాద్కు వచ్చాక ప్యాకెట్ తెరిచి చూస్తే అవన్నీ దొంగనోట్లని తెలిసిందని వారు వాపోయారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios