Asianet News TeluguAsianet News Telugu

బ్లఫ్ మాస్టర్ : ఉన్నతవర్గాలే టార్గెట్.. నకిలీ ఆధార్ తో మోసాలు.. పేరు కూడా ఫేకే...!

ఈ మోసగాడి అసలు పేరు ఏమిటి అనేది ఎవరికీ తెలియలేదు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా డోన్ నుంచి పొందినట్లుగా ఉన్న ఆధార్ కార్డును వినియోగించి ఇతగాడు ఓ కన్సల్టెన్సీ ద్వారా నగరంలో ఉద్యోగాల్లో చేరారు. 

former IAS officer worker steal rs 13 lakh case in hyderabad - bsb
Author
Hyderabad, First Published Jul 14, 2021, 10:57 AM IST

నగరానికి చెందిన ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఇంట్లో పని చేస్తూ ఆయన సిమ్ కార్డు కాజేసి బ్యాంకు ఖాతా నుంచి రూ.13 లక్షలు కాజేసిన కేటుగాడు ప్రస్తుతం నేపాల్ లో ఉన్నట్లు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు.  బోగస్‌ ఆధార్ కార్డు తో పనిలో చేరిన ఇతగాడు.. సదరు అధికారి అనుమతి లేకుండా ఆయన ఇంటి చిరునామా తో ఇంకో ఆధార్ కార్డు దరఖాస్తు చేసుకున్నట్లు తేలింది.

గతంలో మరో ప్రముఖుడి ఇంట్లోనూ ఇతడు పనిచేసినట్లు ఆధారాలు సేకరించారు.  మోసపోయిన వారి సంఖ్య భారీగా ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ మోసగాడి అసలు పేరు ఏమిటి అనేది ఎవరికీ తెలియలేదు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా డోన్ నుంచి పొందినట్లుగా ఉన్న ఆధార్ కార్డును వినియోగించి ఇతగాడు ఓ కన్సల్టెన్సీ ద్వారా నగరంలో ఉద్యోగాల్లో చేరారు. 

అందులో ఇతని పేరు సురేందర్రావు గా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.  సురేందర్రావు ఉద్యోగం ఇప్పించి కన్సల్టెన్సీ లోనూ పోలీసులు ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే అతడు మాజీ ఐఏఎస్ ఇంట్లో సహాయకుడిగా ఉద్యోగంలో చేరడానికి ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడి వద్ద దాదాపు రెండు నెలల పాటు పని చేసినట్లు వెలుగులోకి వచ్చింది.  

మాజీ ఐఏఎస్ వద్ద చేస్తున్నప్పుడే ఆయన కొంతకాలంగా వినియోగించని సిమ్ కార్డు తస్కరించిన ఇతను తన ఫోన్లో వేసుకున్నాడు. దాని ఆధారంగా కొన్ని ఆప్స్ డౌన్లోడ్ చేసుకుని ఆక్టివేట్ చేసుకున్నాడు.  వీటి ఆధారంగా దఫదఫాలుగా మొత్తం 13 లక్షలు కాజేశాడు. దాదాపు ఆరు నెలల పాటు ఈ మాజీ అధికారి వద్ద పనిచేసిన సురేందర్రావు ఆయన ఇంటి చిరునామా తన పేరిట కొత్తగా ఆధార్ కార్డు దరఖాస్తు చేసుకున్నాడు. డబ్బు కాజేసిన తర్వాత తన తల్లిదండ్రులకు కరోనా వచ్చింది అంటూ చెప్పి పని మానేశాడు.

అతగాడు పరారైన తర్వాతే డబ్బు పోయిన విషయం యజమాని గుర్తించాడు. సురేందర్రావు గా చెప్పుకునే అతడు తెలుగు, హిందీ మాట్లాడే వాడిని బాధిత కుటుంబం చెబుతోంది.  అతడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఆధార్ కార్డు ఇటీవలే పోస్టులో మాజీ అధికారి ఇంటికి వచ్చింది. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సురేందర్రావు కాల్ లిస్టును పరిశీలించిన పోలీసులు తరచుగా బీహార్కు చెందిన తన ప్రియురాలితో మాట్లాడినట్లు గుర్తించారు.

కర్నూలు హైదరాబాదు లో ఉన్న వారితో చాలా తక్కువగా సంభవించినట్లు తేల్చారు. అతడు కన్సల్టెన్సీ లో ఇచ్చిన ఆధార్ కార్డు లోని చిరునామా బోగస్‌దిగా పోలీసులు గుర్తించారు.  ప్రస్తుతం ఈ నేరగాడి తోపాటు బీహార్కు చెందిన అతడి ప్రియురాలు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. సాంకేతిక ఆధారాలను బట్టి వాళ్ళు ప్రస్తుతం నేపాల్ లో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇతగాడు గతంలో చేసిన నేరాలపై  కూడా దృష్టి పెట్టిన అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios