కీసరలో విషాదం: దంపతుల ఆత్మహత్య, ఎందుకంటే?


మేడ్చల్ జిల్లాలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Couple Committed Suicide in Medchal District lns

హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో  శనివారం నాడు విషాదం చోటు చేసుకుంది. మృతదేహలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

పిల్లలను  బంధువులను ఇంటికి పంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.   సురేష్ కుమార్, అతని భార్య భాగ్యలు  ఆత్మహత్య చేసుకున్నారు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేకే దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రచారం సాగుతుంది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేకే ఆత్మహత్య  చేసుకున్నారా ? ఇంకా ఇతర కారణాలున్నాయా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆన్ లైన్ లో రుణాలు చెల్లించాలని  లోన్ యాప్  ఏజంట్లు ఒత్తిడి చేయడంతో గతంలో పలువురు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో నమోదయ్యాయి. క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించాలని ఒత్తిడిపై పోలీసులకు ఫిర్యాదులు కూడ అందాయి.

also read:తమిళనాడు విరుద్‌నగర్ బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం: పది మంది మృతి

ఆన్ లైన్ రుణాలు చెల్లించే యాప్ లపై  పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. దీంతో  ఆన్ లైన్ లోన్ యాప్ సంస్థలకు చెందిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంస్థల వెనుక చైనా సంస్థల ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించిన విషయం విదితమే. ఇందుకు సంబంధించి పోలీసులు కేసులు కూడ నమోదు చేశారు. 

ఆత్మహత్యలు పరిష్కారం కావు

జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios