కరీంనగర్: అర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కరీంనగర్ పట్టణంలోని జ్యోతినగర్ లో చోటు చేసుకొంది.

 కరీంనగర్ లో జ్యోతినగర్ లో నివాసం ఉండే సమ్మయ్య కుటుంబం అప్పులు పెరిగిపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసింది.  సమ్మయ్య ఆయన భార్య కృష్ణవేణి కొడుకు మోక్షజ్ఞ   ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు.ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భార్యభర్తలు మరణించారు.

"

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భార్యాభర్తలు మరణించారు. దంపతులు మరణించిన విషయం తెలిసిన బంధువులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.