వివాహేతర సంబంధం కారణంగా ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లాలోని దేవనూరు గ్రామంలో చోటుచేసుకోగా..  ఈఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గామ్రం‍లోని పెద్దజాలుగుంట వద్ద ఇద్దరు వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. జిల్లాలోని ధర్మసాగర్ మండలం దేవునూర్ గ్రామంలోనీ పెద్దజాలుగుంట వద్ద ఇద్దరు వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. 

మృతి చెందిన వారు బాకాటి సుమన్(35), ముల్కనూరు చెందిన సుంచు మాధవి(35)గా పోలీసులు గుర్తించారు. అయితే వీరి ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమన్‌, మాధవికి వరసకు అల్లుడు అవుతాడని తెలుస్తోంది.

వారిద్దరికీ వరస కుదరకపోవడంతో.. ఈ విషయం అందరికీ తెలియడంతో.. వారు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.