అద్దె ఇల్లు చూడడానికి వచ్చి.. దొరికిందే ఛాన్స్ అని పాడుపని చేసిన జంట.. యజమాని చూడడంతో....
ఇల్లు అద్దెకు ఇచ్చేవారు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పే ఘటన ఇది. అద్దెఇల్లు కావాలంటూ వచ్చిన ఓ జంట.. ఇంట్లోకి దిగకముందే కాపురం చేశారు. సరససల్లాపాల్లో మునిగితేలుతూ యజమానికి పట్టుపడి పారిపోయారు.
హైదరాబాద్ : Rental house కావాలని ఇంట్లోకి ప్రవేశించిన ఓ couple.. అసహ్యమైన పనులు చేస్తూ యజమానికి అడ్డంగా దొరికిపోయారు. గది వదిలి బయటకు పరుగులు తీసి బైక్ పై పారిపోయారు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బి.కె గూడాలో ఓ ఇంటికి Tolet board ఉండడంతో ఓ జంట అక్కడికి వచ్చారు. తాము భార్యాభర్తలమని అద్దె ఇల్లు కావాలని అడిగారు. ఇల్లు చూస్తామని రెండవ అంతస్తులోని గదిలోకి వెళ్లిన జంట ఎంతకూ కిందికి రాకపోవడంతో యజమాని పైకి వెళ్ళాడు.
అద్దెకు ఇచ్చే గది తలుపు తీసి చూసి కంగుతిన్నాడు. లోపల జంట సరససల్లాపాల్లో మునిగి వుండటం చూసి గట్టిగా మందలించాడు. వెంటనే ఆ ఇద్దరు కిందికి పరుగుతీశారు. యువతి రోడ్డుపై పరిగెత్తగా, ఆమె వెనకే యువకుడు బైక్ తీసుకుని ఉడాయించాడు. సీసీ కెమెరా ఫుటేజ్ లో నమోదైన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేశాయి. యజమాని సీసీ ఫుటేజీ లతో పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
ఇదిలా ఉండగా, నిరుడు అక్టోబర్ లో ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివాహిత ఒంటరితనాన్ని, నిస్సహాయతను ఆసరాగా చేసుకుని ఒక కామాంధుడు అద్దె ఇల్లు చూపిస్తానని చెప్పి లైంగిక దాడి జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే సమయంలో బాధితురాలు చాకచక్యంగా ఉపయోగించిన దిశ యాప్ నిందితుడిని పట్టించింది. ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాల మధ్య జరిగిన ఈ ఘటన వివరాలను రామచంద్రపురం డీఎస్పీ డి. బాలచంద్రారెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్ లో బుధవారం వెల్లడించారు. మండపేటకు చెందిన Married women తన భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా కొన్ని నెలలుగా అదే పట్టణంలో అమ్మగారి ఇంటివద్ద ఉంటోంది.
కుటుంబ సభ్యులకు భారం కాకూడదనే ఉద్దేశ్యంతో తన కుటుంబానికి సన్నిహితుడైన కపిలేశ్వరపురం మండలం వడ్లమూరుకు చెందిన అంగర వీర్రాఘువులను Rental house చూస్తే వేరేగా ఉంటానని చెప్పింది. ఈ నెల 22రాత్రి బాధితురాలికి అద్దె ఇల్లు చూపిస్తానని చెప్పి రాఘవులు తన బైక్ పై జొన్నాడ తీసుకువచ్చి బాగా పొద్దు పోయేవరకూ పలు ప్రదేశాలకు తిప్పాడు. మాయ మాటలతో మభ్యపెట్టి జొన్నాడలోన తన friend ఇంటి వద్ద ఈ రాత్రి ఉండి ఉదయం వెళదామని నమ్మబలికాడు. అక్కడ నుంచి ఆమెను వెదురుమూడికి చెందిన దుర్గాప్రసాద్ సహకారంతో వడ్లమూరులో తన నివాసానికి తీసుకుపోయి Sexual assault జరిపారు.
దిశ యాప్ ను ఆశ్రయించిన బాధితురాలు...
లైంగిక దాడితో తీవ్ర అస్వస్థతకు గురైన victim తన మొబైల్ నుంచి దిశ యాప్ ద్వారా కాల్ చేయడంతో పోలీసులకు సమాచారం అందింది. విషయం గ్రహించిన నిందితుడు రాఘవులు ఆమె సెల్ ఫోన్ ను లాక్కుని స్విచాఫ్ చేయడంతో సిగ్నల్ కట్ అయ్యింది. అప్పటికే disha app ద్వారా సమాచారం అందుకున్న మండపేట రూరల్ సీఐ పెద్దిరెడ్డి శివగణేష్, ఆలమూరు ఎస్సై ఎస్. శివప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. మండపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందన్న సమాచరాంతో అక్కడకు వెళ్లి బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు.
అక్టోబర్ 28 తెల్లవారుజామున నిందితులిద్దరినీ వారి నివాసాల వద్దే అదుపులోకి తీసుకుని ఆలమూరు పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ కేసును ఛేదించిన సీఐ శివగణేష్, ఎస్సై శివప్రసాద్ ను డీఎస్పీ బాలచంద్రారెడ్డి అభినందించారు. ప్రతి మహిళ దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని రక్షణ పొందాలని ఆయన సూచించారు.