కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలైంది: సోనియాతో భేటీ తర్వాత వైఎస్ షర్మిల

కాంగ్రెస్ పార్టీ  అగ్రనేత  సోనియాగాంధీతో  వైఎస్ఆర్‌టీపీ చీఫ్  వైఎస్ షర్మిల ఇవాళ భేటీ అయ్యారు.

Countdown has started For KCR  Says YSRTP Chief YS Sharmila lns

హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని  వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల  ప్రకటించారు. వైఎస్ఆర్‌టీపీ చీఫ్  వైఎస్ షర్మిల గురువారంనాడు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత ఆమె న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో  భేటీ అయినట్టుగా  వైఎస్ షర్మిల చెప్పారు.  తమ మధ్య  నిర్మాణాత్మక చర్చలు జరిగాయన్నారు.

తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు  నిరంతరం పనిచేస్తూనే ఉంటుందన్నారు. వైఎస్ బిడ్డగా తాను ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటానని ఆమె తెలిపారు.సోనియాగాంధీతో భేటీ కోసం  నిన్న సాయంత్రమే  వైఎస్ షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్ లు న్యూఢిల్లీకి వచ్చారు. ఇవాళ ఉదయం సోనియాతో షర్మిల సమావేశమయ్యారు. 

వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని  షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారని గత కొంత కాలంగా ప్రచారం సాగుతుంది.  కర్ణాటక  డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా షర్మిల తన ప్రయత్నాలను  ప్రారంభించారు.ఈ క్రమంలోనే  పలువురు కాంగ్రెస్ నేతలతో  ఈ విషయమై  షర్మిల  చర్చలు జరిపినట్టుగా  ప్రచారంలో ఉంది. అయితే కాంగ్రెస్ లో వైఎస్ఆర్‌టీపీ విలీనం వార్తలను షర్మిల గతంలో తోసిపుచ్చారు.  అయితే  ఇవాళ సోనియాగాంధీతో షర్మిల భేటీ  వైఎస్ఆర్‌టీపీ విలీనంపై  ప్రచారానికి మరింత  ఊతమిచ్చింది.  అయితే  తమ మధ్య నిర్మాణాత్మకమైన చర్చలు జరిగినట్టుగా  కూడ షర్మిల ప్రకటించారు.

also read:సోనియాగాంధీతో షర్మిల భేటీ:వైఎస్ఆర్‌టీపీ విలీనంపై చర్చ?

వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ లో  విలీనానికి సంబంధించి త్వరలోనే మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశాలున్నాయనే  సమాచారం.   వైఎస్ షర్మిలను  ఏపీ రాష్ట్రానికే పరిమితం చేస్తారా.. తెలంగాణలో  కూడ ఆమె సేవలను  ఉపయోగించుకుంటారా అనే విషయమై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణలో ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ తరుణంలో వైఎస్ షర్మిల సేవలను  వినియోగించుకుంటే తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చి కేసీఆర్ రాజకీయంగా లబ్దిపొందే అవకాశం ఉందని  కాంగ్రెస్ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు.

మరికొందరు ఈ వాదనతో విబేధిస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల  వస్తే  ఏపీలో  కాంగ్రెస్ కు రాజకీయంగా  ప్రయోజనం కలిగే అవకాశం ఉందని  ఆ రాష్ట్రానికి చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.  వైఎస్ఆర్ కూతురుగా ఏపీ ప్రజలు  షర్మిలను ఆదరించే అవకాశం ఉందని  చెబుతున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios