నిజామాబాద్: తెలంగాణలో ఓ మహిళా కార్పోరేటర్ అరాచకం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కార్పోరేటర్ లత భర్త శ్రీను ఓ మైనర్ బాలికను గత 8 నెలలుగా వేధిస్తూ వస్తున్నాడు.

అతని వేధింపులను భరించలేక బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్పోరేటర్ ఇంటి పక్కన గల ఇంటిలో ఉంటున్న మైనర్ బాలికపై తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ వస్తున్నాడు. 

శ్రీను బాలికను వేధిస్తున్న విషయం అతని భార్య లతకు కూడా తెలిసింది. ఆమె బాలిక కుటుంబ సభ్యులతో సంప్రదింపులు కూడా జరిపారు. చివరకు అతని నిర్వాకం పోలీసులకు చేరింది.