కేసీఆర్ కనుసన్నల్లో పెద్ద ఎత్తున రాజీనామాలు

ఇప్పటివరకు మొత్తం 25 మంది రాజీనామాలు చేవారు. వీరంతా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి తమ రాజీనామా లేఖలు పంపించారు. 

Corporation chairman's, cmd Resignation in Telangana - bsb

తెలంగాణలో ఈ వారం అంతా ఎన్నికల హడావుడి కొనసాగుతోంది.  ప్రభుత్వ మార్పుతో రాష్ట్రమంతా ముఖ్యమంత్రి ఎవరు? అన్నదానిమీదే వాదోపవాదాలు..ఉత్కంఠ నెలకొంది. గత పదేళ్లుగా ఉన్న ప్రభుత్వం మారడంతో..ఇప్పటికే ప్రభుత్వంలో వివిధ పదవుల్లో, హోదాల్లో ఉన్నవారికి  షాక్ తగిలినట్లైంది. మూడోసారి కూడా ముచ్చటగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఊహించిన వారికి ఇది పెద్ద దెబ్బగా మారింది. దీంతో సోమవారం ఒక్కసారిగా రాజీనామాల పర్వం ఊపందుకుంది. బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాల మేరకు రాజీనామాల పర్వం కొనసాగుతోంది. 

వీరంతా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి తమ రాజీనామా లేఖలు పంపించారు. ఇప్పటివరకు రాజీనామాలు చేసిన వారు ఎవరెవరంటే..

ట్రాన్స్ కో, జెన్ కో ఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు విద్యుత్ సంస్థల్లో 50 ఏళ్లకు పైగా విధులు నిర్వర్తించారు. ఆ తరువాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ట్రాన్స్ కో, జెన్ కో సిఎండిగా  కొనసాగుతున్నారు.  ఆయన సోమవారం నాడు తన రాజీనామాను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మకు అందించారు. దీంతోపాటు ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించాలో కూడా సిఫారసు చేశారు. ట్రాన్స్ కో సీఎండీగా ఇన్చార్జి బాధ్యతలను జేయండీ శ్రీనివాసరావుకు, జెన్ కో సిఎండిగా ఇన్చార్జి బాధ్యతలు డైరెక్టర్ అజయ్ కు అప్పగించాలని సిఫారసు చేశారు. 

రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కెసిఆర్ కు దగ్గరి బంధువు. ఆయన టిఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు.  ఆయన కూడా ప్రభుత్వం మారిన నేపథ్యంలో రాజీనామా సమర్పించారు. యాంటీనక్సల్స్ ఇంటిలిజెన్స్ ఓఎస్డి టి ప్రభాకర్ రావు కూడా రాజీనామా చేశారు. మూడేళ్ల క్రితమే ప్రభాకర్ రావు ఐజిగా రిటైర్ అయ్యారు.  రిటైర్ అయినా కూడా కెసిఆర్ ఆయనను ఇంటిలిజెన్స్ ఓఎస్ డిగా నియమించారు. రేవంత్ రెడ్డి గతంలో ప్రభాకర్ రావుపై  విరుచుకుపడ్డారు. కేసీఆర్ బంధువు కావడంతోనే రిటైర్ అయినా పదవిలో కొనసాగిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

బ్రాహ్మణ పరిషత్ చైర్మన్, ప్రభుత్వ సలహాదారుగా ఉన్న రమణాచారి  కూడా రాజీనామా చేశారు. ఆయన రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా ఉన్న సమయంలోనే తన పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు.  ఈ క్రమంలోనే కెసిఆర్ ప్రభుత్వ సలహాదారుగా రమణాచారిని నియమించారు. ఆ తర్వాత క్రమంలో బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ పదవిని ఇచ్చారు.  రమణాచారి తో పాటు బ్రాహ్మణ పరిషత్ కి వైస్ చైర్మన్ గా ఉన్న వనం జ్వాలా నరసింహారావు  కూడా రాజీనామా చేశారు.

టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఉన్న 91 కార్పొరేషన్లు మరో 142 వివిధ సంస్థలు అకాడమీల్లో 60కి పైగా కార్పొరేషన్లకు చైర్మన్ లను నియమించింది.అయితే వీటిల్లో ఎలాంటి ఆదాయము లేని కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. దీంతో ఓ సమయంలో తీవ్ర విమర్శలు వినిపించాయి. ఈ కార్పొరేషన్ల చైర్మన్ లకు నెలకు రూ. లక్ష జీత, వాహనాలు, సిబ్బంది  ప్రత్యేక చాంబర్లు లాంటి సదుపాయాలు ఉన్నాయి.

ఇప్పటివరకు రాజీనామా చేసిన కార్పొరేషన్ చైర్మన్లు ఎవరంటే…

నె. కార్పొరేషన్ చైర్మన్
1 రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ సోమా భరత్
2 పౌరసరఫరాల అభివృద్ధి సంస్థ రవీందర్ సింగ్
3 తెలంగాణ సాహిత్య అకాడమీ జూలూరి గౌరీ శంకర్
4 టీఎస్ఎండిసి చైర్మన్ మన్నెం క్రిశాంక్
5 వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎర్రోళ్ల శ్రీనివాస్
6 గొర్రెలు,  మాంసాభివృద్ధి సంస్థ దూదిమెట్ల బాలరాజు
7 వికలాంగుల కార్పొరేషన్  కె. వాసుదేవరెడ్డి
8 పర్యటకాభివృద్ధి సంస్థ  గెల్లు శ్రీనివాస్
9 టెక్నాలజీ సర్వీసెస్  పాటి మీద జగన్మోహన్రావు
10 ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్  గజ్జల నగేష్
11 టీఎస్ ఫుడ్స్  మేడెం రాజీవ్ సాగర్
12 శాక్స్                ఆంజనేయ గౌడ్
13 రెడ్ కో  వై సతీష్ రెడ్డి
14 ట్రైకార్  రామచంద్రనాయక్
15 టెక్స్టైల్ కార్పొరేషన్ గూడూరు ప్రవీణ్
16  జిసిసి వాల్యా నాయక్
17 గీతా వృత్తిదారుల సహకార సంస్థ పల్లె రవికుమార్
18 శాతవాహన అర్బన్ డెవలప్మెంట్  అథారిటీ  జీవి రామకృష్ణారావు       
19    

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios