Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో మళ్లి పెరిగిన కేసులు, ఒకేరోజు 1986 కేసుల నమోదు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 1986 కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 62,703కు చేరుకుంది. కేసుల వివరాలను వెల్లడిస్తూ నేటి ఉదయం తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ ని విడుదల చేసింది. 

Coronavirus Updates Telangana: 1986 Cases recorded In A Single Day
Author
Hyderabad, First Published Jul 31, 2020, 9:46 AM IST

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 1986 కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 62,703కు చేరుకుంది. కేసుల వివరాలను వెల్లడిస్తూ నేటి ఉదయం తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ ని విడుదల చేసింది. 

నిన్నొక్కరోజే 14 మంది మృతి చెందారు. జాతీయ రికవరీ రేట్ కన్నా తెలంగాణాలో ఎక్కువగా ఉందని తెలిపారు. రికవరీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 72.3శాతంగా ఉందనితెలిపారు. మరణాల రేటు 0.82 శాతంగా ఉందని రాష్ట్రంలో ఇప్పటి వరకు 45,388 మంది రోగులు కోలుకోగా.. 519 మంది చనిపోయారు. ప్రస్తుతం తెలంగాణలో 16,796 యాక్టివ్ కేసులున్నాయి.

గురువారం 816 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. మరో 14 మంది మరణించారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 586, మేడ్చల్ మల్కాజ్‌ ‌గిరిలో 207, రంగారెడ్డిలో 205, కరీంనగర్‌లో 116, సంగారెడ్డిలో 108, వరంగల్ అర్బన్‌లో 123మందికి కరోనా నిర్ధారణ అయింది.

గడిచిన 24 గంటల్లో 21,380 శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు 4,37,582) పరీక్షలు నిర్వహించినట్టుగా బులెటిన్ లో తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios