Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో కరోనా పరీక్షలకు బ్రేకులు!

ప్రభుత్వం అధిక టెస్టులను చేయాలనీ నిర్ణయించడంతో... సాంపిల్స్ సేకరణ అధికంగా జరుగుతోంది. సాంపిల్స్ అధికంగా పేరుకొని పోవడంతో..... ఒక రెండు రోజులపాటు కరోనా సాంపిల్స్ కలెక్షన్ కు తాత్కాలిక బ్రేకులు వేసింది.

Coronavirus Samples Collection Temporarily suspended For Two days
Author
Hyderabad, First Published Jun 25, 2020, 12:59 PM IST

హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. కరోనా వ్యాప్తి, తీవ్రత అధికమవడంతో జిహెచ్ఎంసీ పరిధిలో 50వేల టెస్టులు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. 

ఇలా ప్రభుత్వం అధిక టెస్టులను చేయాలనీ నిర్ణయించడంతో... సాంపిల్స్ సేకరణ అధికంగా జరుగుతోంది. సాంపిల్స్ అధికంగా పేరుకొని పోవడంతో..... ఒక రెండు రోజులపాటు కరోనా సాంపిల్స్ కలెక్షన్ కు తాత్కాలిక బ్రేకులు వేసింది. పెండింగ్ సాంపిల్స్ టెస్టులను రెండు రోజుల్లో పూర్తిచేసి తిరిగి సాంపిల్స్ సేకరణ ప్రారంభిస్తామని అధికారులు అంటున్నారు. 

రెండు రోజుల తరువాత మరల సాంపిల్స్ కలెక్షన్ ప్రారంభమవుతుందని అధికారులు అంటున్నారు. ఇకపోతే.... తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బుధవారం కొత్తగా 891 మంది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 10,444కి చేరుకుంది. బుధవారం కొత్తగా ఐదుగురు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 225కు చేరింది.

నిన్న కరోనా నుంచి 137 మంది డిశ్చార్జవ్వడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,361కి చేరింది. ప్రస్తుతం 5,858 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

బుధవారం ఒక్క హైదరాబాద్‌లోనే 719 కేసులు నమోదవ్వగా... రంగారెడ్డిలో 86, మేడ్చల్ 55, ఖమ్మం 4, భద్రాద్రి 6, వరంగల్ 6, సంగారెడ్డి, కరీంనగర్, నల్గొండల్లో రెండేసి చొప్పున, కామరెడ్డి, సిద్ధిపేట, సిరిసిల్ల, గద్వాల, పెద్దపల్లి, నిజామాబాద్, మహబూబాబాద్, ఆదిలాబాద్‌లో ఒక్కో కేసు చొప్పున వెలుగుచూశాయి. 

ఇక హైదరాబాద్ లోని ఇంటర్మీడియట్ బోర్డు జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ కు కరోనా సోకింది. దీంతో వారిద్దరూ కూడ చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరారు.కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. 

ఈ సమయంలోనే కీలకమైన అధికారులు కరోనా బారిన పడడం కొంత ఇబ్బందిగా మారింది. దీంతో కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇంటర్ బోర్డు ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారులకు కూడ కరోనా లక్షణాలు ఉన్నాయని ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు.ఇంటర్ ఫలితాల్లో అనుమానాలు ఉన్నవారు ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు అధికారులు సూచించారు. రీ వాల్యూయేషన్, రీ కౌంటింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios